For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలన్నీ డిజాస్టర్.. నాని, రవితేజ సినిమాలను కూడా..

  |

  మెగాస్టార్ చిరంజీవి వారసత్వం నుంచి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంచనాలకు తగ్గట్లుగానే తన స్థాయిని. మెల్లమెల్లగా పెంచుకున్నాడు. రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్ వాల్యుని కూడా దేశవ్యాప్తంగా మరింత పెంచుకొనున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కెరీర్ లో స్టోరీ సెలక్షన్ అనేది చాలా కీలకమని చెప్పాలి. కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి డిజాస్టర్స్ నుంచి తప్పించుకున్నాడు. మరికొన్ని హిట్టయినా కూడా చరణ్ చేసి ఉంటే అంతగా సెట్టయ్యేవి కావేమో. ఆ లిస్ట్ పై ఒక లుక్కేస్తే..

  ఆ స్పెషల్ మూవీ ప్లాప్ అయినప్పటికీ..

  ఆ స్పెషల్ మూవీ ప్లాప్ అయినప్పటికీ..

  రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇక నుంచి అంతకుమించి అనేలా ఉంటాయని చెప్పవచ్చు. RRR సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిరుత నుంచి కూడా మెగాపవర్ స్టార్ కేవలం కమర్షియల్ సినిమాలనే కాకుండా ఆరెంజ్ లాంటి విభిన్నమైన స్టోరీలను కూడా టచ్ చేశాడు. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ నేటితరం వారికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది.

  గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వంలో..

  గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వంలో..

  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎటో వెళ్ళిపోయింది మనసు కథను మొదట రామ్ చరణ్ కోసం అనుకున్నారు. కానీ అది చివరకు నాని వద్దకు వెళ్లింది. మ్యూజికల్ గా ఆ సినిమా పరవాలేదు అనిపించింది. నిజంగా ఆ సినిమాను అప్పట్లో రామ్ చరణ్ చేసి ఉంటే అంతగా హిట్టయ్యి ఉండేది కాదేమో అనే కామెంట్స్ చాలానే వచ్చాయి.

  ఓకే బంగారం..

  ఓకే బంగారం..

  రామ్ చరణ్ కు ఇష్టమైన దర్శకుల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ , మణిరత్నం ఒకరు. GVM తో సరైన కథ సెట్టవ్వకపోవడంతో చేసే ఛాన్స్ దోర్కలేదు. కానీ ఎలాగైనా మణిరత్నంతో చేయాలని ఆ ఆ మధ్య చర్చలు బాగానే నడిచాయి. ఓకే బంగారం కథను చెప్పగా రామ్ చరణ్ ఒప్పుకోలేదు.

  నాని డిజాస్టర్ సినిమా

  నాని డిజాస్టర్ సినిమా

  నాయక్ సినిమా అనంతరం మళ్ళీ ద్విపాత్రాభినయం కథలు చాలానే వచ్చాయట. నాని చేసిన కృష్ణార్జున యుద్ధం కథను కూడా దర్శకుడు మెర్లపాక గాంధీ మొదట రామ్ చరణ్ కోసమే అనుకున్నాడు. కానీ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ మరీ ఎక్కువగా ఉండడంతో రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

  రవితేజ ఎంతో నమ్మకంతో చేసిన సినిమా

  రవితేజ ఎంతో నమ్మకంతో చేసిన సినిమా

  రవితేజ ఎంతో నమ్మకంతో చేసిన నేల టిక్కెట్టు కథ కూడా మొదట్లో మెగా కాంపౌండ్ చుట్టూ తిరిగింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయనా హిట్టయిన వెంటనే అగ్ర హీరోలకు కథలను చెప్పే ఛాన్స్ అందుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక చివరికి రవితేజతో ఆ సినిమాను చేయగా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

  Ichata Vahanamulu Nilupa Radu Teaser
  ఆ సినిమా ప్లాప్ అయినప్పటి నుంచి..

  ఆ సినిమా ప్లాప్ అయినప్పటి నుంచి..

  కేవలం ఈ సినిమాలే కాకుండా మెరుపు, అగ్నిపాత్ రీమేక్. అల్లు అరవింద్ రామాయణం.. వంటి సినిమాలతో పాటు కొందరి స్టార్ దర్శకుల ఆఫర్స్ ను కూడా చరణ్ రిజెక్ట్ చేశాడు. గోవిందుడు అందరివాడే లాంటి డిజాస్టర్స్ అనంతరం రామ్ చరణ్ సేఫ్ జోన్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.

  కథ నచ్చకపోతే దర్శకులకు డైరెక్ట్ గా మొహం మీదే చెప్పేస్తున్నారాట. తన సినిమా కారణంగా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ వీలైనంత వరకు లాభాలను అందుకోవాలనే ఆలోచనతోనే చరణ్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

  English summary
  Story selection is very crucial in Ram Charan's career. Rejected some movies and escaped disasters. If Charan had made a few more hits, would they have been so set? If you take a look at that list ..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X