For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Charan Remuneration..డిస్నీ+హాట్ స్టార్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంత పారితోషికం తీసుకొంటున్నాడంటే?

  |

  మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కెరీర్‌ ఎప్పుడూ లేనంతగా ఉన్నత స్థితిలో కనిపిస్తున్నది. ఎస్ఎస్ రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో పనిచేస్తూ నటుడిగా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీలో అగ్రస్థానం సంపాదించుకొన్న డిస్నీ+హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అయితే డిస్నీ+హాట్ స్టార్‌ ఇస్తున్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాంచరణ్ పారితోషికం ఎంతంటే..

  Natraj Master భార్య నీతూ సీమంతం ఫోటోలు.. బుల్లితెర తారలే దిగివచ్చి!

  ప్యాన్ ఇండియా హీరోగా రాంచరణ్

  ప్యాన్ ఇండియా హీరోగా రాంచరణ్

  టాలీవుడ్‌లో హీరోగా ఇప్పటికే ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్యాన్ ఇండియా స్టార్‌గా RRR చిత్రంతో ఆకట్టుకోవడానికి సిద్దమయ్యారు. అలాగే శంకర్, దిల్ రాజు కాంబినేషన్‌లో రాబోతున్న ప్యాన్ ఇండియా చిత్రంతో తన స్టార్ స్టామినాను మరోసారి నిరూపించుకోబోతున్నారు. ఇంకా పలువురు అగ్ర దర్శకులతో పలు సినిమాల చేసేందుకు ప్లాన్ చేసుకోబోతున్నారు.

  Bigg Boss Telugu 5 లో రాంచరణ్.. మెగా తనయుడిని టార్గెట్ చేసిన ఆ ఇద్దరు.. తమన్నా, నభా నటేష్ రచ్చ

  నిర్మాతగా మెగా పవర్ స్టార్ సరికొత్తగా

  నిర్మాతగా మెగా పవర్ స్టార్ సరికొత్తగా

  ఇక నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి తన సత్తాను నిరూపించుకొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలను నిర్మించి సక్సెస్ అందుకొన్నారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడంతోపాటు ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇలా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

  డిస్నీ+హాట్ స్టార్‌కు అంబాసిడర్‌గా

  డిస్నీ+హాట్ స్టార్‌కు అంబాసిడర్‌గా

  ఇలా కెరీర్ పరంగా బిజీగా దూసుకెళ్తున్న రాంచరణ్ కెరీర్‌ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ వ్యవహరించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డిస్నీ+హాట్ స్టార్ కోసం రూపొందించిన యాడ్‌లో రాంచరణ్ బాడీ లాగ్వేంజ్, పెర్ఫార్మెన్స్ కొత్తగా కనిపించింది. యాడ్‌లో రాంచరణ్‌ను చూసి నాగార్జున కూడా ప్రశంసలు కురిపించారు.

  యూత్‌ను ఆకర్షించడానికే రాంచరణ్‌ను

  యూత్‌ను ఆకర్షించడానికే రాంచరణ్‌ను

  టాలీవుడ్‌లో ఎంతో మంది యువ హీరోలు ఉన్నా.. డిస్నీ+హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్ రాంచరణ్‌కే దక్కడంపై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. యూత్‌లో రాంచరణ్‌కు మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నందునే ఈ ఆఫర్ చెర్రీకి దక్కిందని, పిల్లలను ఆకర్షించే విధంగా రాంచరణ్‌ను ఇందుకు ఎంపిక చేశారనే విషయం స్పష్టమైంది. అదే విషయాన్ని స్వయంగా రాంచరణ్ కూడా వెల్లడించడం గమనార్హం.

  ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే?

  ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే?

  ఇక రాంచరణ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఒక్కో సినిమాకు సుమారు 20 కోట్ల నుంచి 25 కోట్ల రెమ్యునరేషన్ అందుకొంటున్నారనే ఇన్‌సైడ్ టాక్. యువ హీరోల్లో అత్యధికంగా పారితోషికం అందుకొనే వారిలో రాంచరణ్ ఒకడిగా ఉన్నారు. RRR చిత్రానికి రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటాను తీసుకోనున్నారనే వార్త సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇలా హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా ఉన్న రాంచరణ్‌ను డిస్నీ+హాట్ స్టార్ రంగంలోకి దించింది.

  Delhi Files Another Bold Attempt In Indian Cinema - Right To Life
  డిస్నీ+ హాట్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే..

  డిస్నీ+ హాట్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇక డిస్నీ+హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రాంచరణ్‌కు భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. ప్రతీ ఏడాది రాంచరణ్‌కు సుమారు రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ చెల్లించే విధంగా కాంట్రాక్టు జరిగినట్టు తెలిసింది. అయితే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఓవరాల్‌గా టాలీవుడ్‌లో ఏ హీరోకు దక్కని ఘనతను రాంచరణ్ దక్కించుకోవడం విశేషంగా మారింది.

  English summary
  Mega Power Star Ram Charan is going to be ambassador Disney+Hotstar OTT app. Now his remuneration is become hot topic in the industry. Reports suggest that, He is going to take 20 crores remuneration for the annum.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X