Game Changer: చిరు అడుగుజాడల్లో రామ్ చరణ్.. ఆ విషయం తెలిస్తే సలాం కొట్టాల్సిందే..
Game Changer Ram Charan: తెలుగు సినిమా స్థాయి రోజురోజుకు పెరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ ఇలా వందల కోట్ల బడ్జెట్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ తరుణంలో రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. ప్రధానంగా హీరోల పారితోషికం విషయానికి వస్తే.. మూవీ మేకర్స్ కు చెమటలు పట్టాల్సిందే. ఆ సినిమా హిట్టా? పట్టా? అనేది సంబంధం లేకుండా కోట్లల్లో పారిదోషకం తీసుకుంటున్నారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం అందుకు భిన్నంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు తొలుత 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని భావించారు. కానీ, పలుమార్లు వాయిదాలు పడడంతో 400 కోట్లకు బడ్జెట్ కు చేరువైంది. దీంతో దిల్ రాజు కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ గా నిలిచింది.

ఇప్పటివరకు ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మించిన దిల్ రాజు.. ఇంత మొత్తంలో భారీ బడ్జెట్ వెచ్చించి, సినిమాలను తీసే సాహసం చేయలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ కు భారం కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట . భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కావడంతో ప్రారంభంలో రామ్ చరణ్ కు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారట. కానీ ఊహించని స్థాయిలో సినిమా ఖర్చులు పెరిగిపోవడం అనుకున్న డేట్ కు సినిమా పూర్తి కాకపోవడం, అలాగే పలుమార్లు వాయిదా పడడంతో అనుకున్న దానికంటే బడ్జెట్ మించిపోయిందట.
దీంతో నిర్మాత దిల్ రాజు తలకు మించిన భారంగా మారిందట. ఈ తరుణంలోనే రామ్ చరణ్ తన పారితోషకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడట.ప్రొడ్యూసర్ కు భారం కాకుండా రామ్ చరణ్ తన పారిదోషకంలో దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా పుచ్చుకున్నారట. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమాకు అది చాలా తక్కువ రెమ్యునరేషనే. అలాగే డైరెక్టర్ శంకర్ కూడా తన రెమ్యూనరేషన్ ను దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు తక్కువ పారితోషకం తీసుకోబోతున్నట్లు టాక్.

వాస్తవానికి గేమ్ చేంజర్ మూవీని కేవలం 200 కోట్లలో పూర్తి చేయాలని దిల్ రాజు, రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ భావించారు. కానీ, సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా.. హై క్వాలిటీతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే పలుసార్లు వాయిదా పడడంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. అయితే.. ఇప్పటివరకు ఈ సినిమాపై ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ టీజర్ చూస్తే.. రామ్ చరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా అనాల్సిందే.


Click it and Unblock the Notifications











