చిరంజీవికి తెలియకుండా.. రానాతో రామ్ చరణ్ అలాంటి పనులు చేశాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన, అభిమానులకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులతో గడిపిన సరదా క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా దగ్గుబాటి రానాతో కలిసి చేసిన అల్లరి పనుల గురించి చరణ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రామ్ చరణ్, రానా దగ్గుబాటి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో చదువుకున్న వీరిద్దరూ కుటుంబ స్నేహితులుగానే కాకుండా ప్రాణ స్నేహితులు. వీరిద్దరి బాల్యం ఎక్కువగా చెన్నైలోనే గడిచింది. ఎన్నో సరదా సంఘటనలకు వేదికగా నిలిచింది. తాజాగా ఆ రోజులను గుర్తు చేసుకున్న చరణ్.. తాము చిన్నప్పుడు ఇంట్లో వాళ్లకు తెలియకుండా అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ప్లాన్‌లు వేసేవాళ్లమని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Ram Charan Reveals Funny Childhood Adventures and Midnight Escapes With Rana Daggubati

చరణ్ చెప్పిన వివరాల ప్రకారం.. తాను, రానా ఇద్దరూ ఉండే గది కిటికీ గ్రిల్స్‌కు ఉన్న స్క్రూలను జాగ్రత్తగా విప్పేసేవారట. ఆ తర్వాత కిటికీ గుండా బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి నైట్ రైడ్స్, ఐస్‌క్రీమ్ పార్టీలు, సరదా షికార్లు చేసేవారట. తెల్లవారుజామున తిరిగి వచ్చి అదే గ్రిల్స్‌ను మళ్లీ యథాస్థితిలో బిగించేసి ఎవరూ గుర్తించకుండా చూసుకునేవారట. కొంతకాలం వరకు ఈ ప్లాన్ విజయవంతంగా సాగినా, చివరికి పెద్దల కంట పడకుండా తప్పించుకోలేకపోయారు.

ఒకరోజు ఎప్పటిలాగే బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కిటికీ గ్రిల్స్ పూర్తిగా సీల్ చేసి ఉండటాన్ని చూసి షాక్ అయ్యామని చరణ్ గుర్తు చేసుకున్నారు. తమ సీక్రెట్ ఎస్కేప్ ప్లాన్‌ను గుర్తించిన కుటుంబ సభ్యులు అదనంగా ఇనుప కడ్డీలు అమర్చి కిటికీని మూసివేశారట. దీంతో ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారని, ఆ తర్వాత ఇంట్లో బాగా క్లాస్ పీకారని చరణ్ నవ్వుతూ చెప్పారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ నవ్వు వస్తుందని ఆయన అన్నారు.

అంతేకాదు, చిన్నప్పుడు తాను చాలా అల్లరి చేసేవాడినని కూడా చరణ్ ఒప్పుకున్నారు. స్కూల్ బంక్ కొట్టడం, చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయటకు వెళ్లడం వంటి పనులు చేసేవాడినని చెప్పారు. ఒకసారి తన తల్లి సురేఖ.. "జీవితంలో ఎవరికీ అబద్ధాలు చెప్పకు" అని మందలించగా, "ఎందుకు?" అని అడిగితే.. "ఎందుకంటే నువ్వు సరిగ్గా అబద్ధం చెప్పలేవు.. వెంటనే దొరికిపోతావు" అని సరదాగా చెప్పిన మాటలను కూడా చరణ్ గుర్తు చేసుకున్నారు.

ఈ సంఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ విషయాలన్నీ మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో తెలియలేదట. కుటుంబంలో అందరికీ తెలిసినా, తల్లి సురేఖ మాత్రం ఈ అల్లరి చేష్టాలను చిరంజీవి వరకు వెళ్లనివ్వలేదని చరణ్ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ కూడా సరదాగా స్పందిస్తూ.. "ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చిరంజీవి గారికి ఖచ్చితంగా తెలిసిపోతుంది" అంటూ చమత్కరించారు.

ప్రస్తుతం రామ్ చరణ్ చెప్పిన ఈ చైల్డ్‌హుడ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులతో పాటు దగ్గుబాటి అభిమానులు కూడా ఈ వీడియో క్లిప్‌లను విపరీతంగా షేర్ చేస్తున్నారు. పైకి చాలా సైలెంట్‌గా, హుందాగా కనిపించే రామ్ చరణ్‌లో ఇంత అల్లరి కోణం ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X