Game Changer: భయంకరమైన ప్లేస్‌లో రామ్ చరణ్ రిస్క్.. ప్రాణం పణంగా పెట్టి మరీ!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి భారీ అంచనాలతో హీరోగా పరిచయమై.. తనదైన టాలెంట్లను చూపించుకుని చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అప్పటి నుంచి ప్రతి సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌‌తో 'గేమ్ చేంజర్' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 60 శాతం వరకూ మాత్రమే షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు.

Ram Charan Risky Shot at Dangerous Place for Game Changer

అత్యంత భారీ బడ్జెట్‌తో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించారు. దీన్ని హైదరాబాద్‌లోని ఓ పాత కెమికల్ ఫ్యాక్టరీలో జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్‌ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా జరుగుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్ ఎన్నో రిస్కీ షాట్స్ చేస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా విష వాయువులు విడుదల అయ్యే అవకాశం ఉన్న ఓ ప్రదేశంలో కూడా రామ్ చరణ్ కాసేపు షూటింగ్ చేసినట్లు తెలిసింది. ఎంతో రిస్క్ అయినా షాట్ పూర్తయ్యే వరకూ అతడు కంటిన్యూ చేసినట్లు సమాచారం.

Ram Charan Risky Shot at Dangerous Place for Game Changer

'గేమ్ చేంజర్' షూటింగ్ గురించి ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ షూటింగ్ స్పాట్‌లో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుందట. ముందుగా పరీక్షలు చేసిన తర్వాతనే చిత్రీకరణను కంటిన్యూ చేసినట్లు తెలిసింది. మొత్తంగా రామ్ చరణ్ డెడికేషన్‌ గురించి తెలిసి చాలా మంది ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X