RRR: రామ్ చరణ్ పాత్రలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.. అల్లూరిలో ఎన్ని షేడ్స్ అంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతకుమించి అనేలా సక్సెస్ అవుతుంది అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ రోజుకొకటి వైరల్ అవుతుంది. ఇప్పటికే రచయిత కే విజయేంద్రప్రసాద్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేలా కొన్ని అంశాలను ఓపెన్ గానే చెప్పేసారు. సినిమాలో ముఖ్యంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ముఖ్యంగా వారి మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని చెప్పేశారు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పాత్రలు కూడా ఒక సన్నివేశంలో చాలా బలంగా పోటీపడతాయని ఒక ఫైట్ సీన్ లో కూడా ఇద్దరు పొట్లాడుకుంటారని కూడా చెప్పేశారు. అయితే ఆ సన్నివేశం చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారట. అన్నదమ్ములు అయినటువంటి వారు కొట్టుకుంటూ ఉంటే ఏ తల్లి తట్టుకోలేదు. ఆ విధంగా ఇద్దరి మధ్యలో వచ్చే ఫైట్ సీన్ ప్రేక్షకుల హార్ట్ ని టచ్ చేస్తుందట.

Ram charan role three different shades in rrr movie

అయితే ఇటీవల రామ్ చరణ్ తేజ్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో RRR సినిమా కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టాడు. ఆ సినిమాలో తన పాత్ర మూడు రకాలుగా ఉంటుంది అని అల్లూరి సీతారామరాజు పాత్ర త్రీ షేడ్స్ లో ఉంటుందని చెప్పాడు. అంటే ముందుగా ఒక మన్యం వీరుడిగా కనిపించబోతున్న అల్లూరి సీతారామరాజు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి బ్రిటిష్ వారితో ఎదురుతిరిగే రెబల్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ మూడు రకాల షేడ్స్ తో రామ్ చరణ్ వెండితెరపై ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇక సినిమా జనవరి 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది అని ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసలైతే డిసెంబర్ 3వ తేదీన సినిమా ట్రైలర్ ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వలన వాయిదా వేయక తప్పలేదు అంతేకాకుండా సినిమా విడుదలపై కూడా కొన్ని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఆ విషయంలో అయితే ఇంతవరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. తప్పకుండా సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X