twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘RRR’లో రామ్ చరణ్ లుక్ ఫొటోలు లీక్.. ఆ హీరోయిన్ దగ్గరకు వెళ్లడంతో..

    |

    Recommended Video

    Ram Charan Latest Look From RRR Movie Revealed || Filmibeat Telugu

    టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం 'RRR'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.. లేదా ఆటంకం వచ్చింది.. అనే వార్తలు వస్తున్నాయి. అలాగే, తారక్ సరసన ఆ హీరోయిన్‌ను అనుకుంటున్నారు.. ఈ హీరోయిన్ ఫిక్స్ అయింది అని ప్రచారం జరుగుతోంది. అయితే, దేనికీ సరైన క్లారిటీ మాత్రం దొరకడం లేదు. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ బయటకు వచ్చాయి.

    హీరోల పాత్రలు ఇవే

    హీరోల పాత్రలు ఇవే

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుండగా, తారక్ మాత్రం కొమరం భీంలా కనిపించనున్నాడు. ఇందుకోసం ఇద్దరు హీరోలు ఎంతగానో కష్ట పడుతున్నారు. జిమ్ముల్లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం తారక్ అయితే ప్రత్యేక నిపుణుడిని కూడా నియమించుకున్నాడు.

    లుక్ విషయంలో జాగ్రత్తలు

    లుక్ విషయంలో జాగ్రత్తలు

    ఈ సినిమా విషయంలో ఏ లుక్కూ బయటకు రాకుండా చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవానికి రాజమౌళి సినిమా అంటేనే ఇలాంటి సస్పెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సినిమా క్యూరియాసిటీ పెంచే భాగంలో ఇలాంటి పనులు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఇద్దరు హీరోలు తమ లుక్ బయటపడకుండా జాగ్రత్తలు పడుతున్నాడు.

    రామ్ చరణ్ లుక్ బయటకొచ్చింది

    రామ్ చరణ్ లుక్ బయటకొచ్చింది

    ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో రహస్యాలు బయటపడుతుంటాయి. తాజాగా రామ్ చరణ్ లుక్ కూడా ఇలాగే బయటకు వచ్చేసింది. ఇందులో అల్లూరి సీతారామరాజులా కనిపించనున్న రామ్ చరణ్.. కోర మీసాలతో ఉన్న తాజా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి.

    హీరోయిన్ బర్త్‌డే పార్టీకి వెళ్లి..

    హీరోయిన్ బర్త్‌డే పార్టీకి వెళ్లి..

    రెండు రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ కియారా అద్వాణీ పుట్టిన రోజు జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. ఆమె ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ పార్టీలో చెర్రీ మెరిశాడు. అప్పుడే సీతారామరాజు లుక్ బయటకు వచ్చింది. అన్నట్లు వీళ్లిద్దరూ ‘వినయ విధేయ రామ' సినిమాలో జంటగా నటించారు. అందుకే చెర్రీ ఈ పార్టీకి వెళ్లాడు.

    ఫ్యాన్స్ ఖుషీ

    ఫ్యాన్స్ ఖుషీ

    మెగా అభిమానులు ఈ ఫొటోను చూసి తెగ ఖుషీ అయిపోతున్నారు. వీళ్లే కాదు.. నందమూరి అభిమానులు సైతం రామ్ చరణ్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసి బాగుదంటూ కితాబిస్తున్నారు. ఈ ఫొటోలు రెండు ఫ్యాన్స్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

    ‘RRR' గురించి..

    ‘RRR' గురించి..

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘RRR'. బడా డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.

    English summary
    Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. Hollywood actress Emma Roberts rejects Rajamouli offer for RRR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X