రాంచరణ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? తెలిస్తే షాకే.. 38 కోట్లతో ఇల్లు తర్వాత లెక్క ఇది!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తాజాగా భారీ మొత్తాన్ని వెచ్చించి విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేయడంతో రాంచరణ్ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. తాజాగా రాంచరణ్‌ నికర ఆస్తుల విలువను ఆంగ్ల వెబ్‌సైట్ అంచనా వేయడం మరింత చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలోనే రాంచరణ్

దక్షిణాదిలోనే రాంచరణ్

రాంచరణ్‌ ఆస్తులు, అభిరుచుల గురించి ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొన్నది. దక్షిణాదిలోనే అత్యంత ఖరీదైన వస్తువులు కలిగిన ఉన్న హీరోల్లో రాంచరణ్ ఒకరని వెల్లడించింది. ఆస్టన్ మార్టిన్ లాంటి విలాసవంతమైన కారు ఆయన అభిరుచికి ఓ నిదర్శనం అని కథనంలో పేర్కొంటున్నది. ఇలాంటి విలాసవంతమైన కార్లు, ఇతర వస్తువులు ఎక్కువగానే ఉన్నాయని వెల్లడించింది.

Recommended Video

Ram Charan Buys A New House For Mind Blowing Cost | Filmibeat Telugu
రూ.38 కోట్లతో కొత్త ఇల్లు

రూ.38 కోట్లతో కొత్త ఇల్లు

ఇటీవల రాంచరణ్, ఉపాసన దంపతులు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుమారు రూ.38 కోట్లు పెట్టి తనకు ఇష్టమైన ఇంటికి ఓనర్ అయ్యారు. దక్షిణాదిలో పరిశీలిస్తే ఇంత విలాసవంతమైన ఇల్లు కలిగిన హీరోల్లో రాంచరణ్ టాప్ అని పేర్కొంటున్నారు.

త్వరలోనే కొత్త ఇంటిలోకి ప్రవేశం

త్వరలోనే కొత్త ఇంటిలోకి ప్రవేశం

జూబ్లీహిల్స్‌లోని ప్రధాన ప్రాంతంలోని అత్యంత ఆధునిక వసతులు ఉన్న ఇంటిలోకి ఉపాసన, రాంచరణ్ దంపతులు త్వరలోనే అడుగుపెట్టనున్నట్టు తెలిసింది. ఇంకా ఇంటికి సంబంధించిన సాంకేతిక పరికరాల అమరిక పనులు తుది దశలో ఉన్నట్టు తెలుస్తున్నది. అన్ని పనులు పూర్తయ్యాక మంచి ముహుర్తం రోజున ఇంటిలోకి వెళ్లనున్నట్టు తెలిసింది.

సినీరంగం, వ్యాపార రంగంలోకి

సినీరంగం, వ్యాపార రంగంలోకి

రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి సినిమా రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగా మారి తన తండ్రి చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని రూపొందించడంతోపాటు బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకొన్నారు. అలాగే వైమానిక రంగ వ్యాపారంలోకి ప్రవేశించి ట్రూజెట్ ఎయిర్‌వేస్‌ను ప్రారంభించారు.

 రాంచరణ్ నికర ఆస్తుల మొత్తం ఇదే

రాంచరణ్ నికర ఆస్తుల మొత్తం ఇదే

ఇలా సినీ, వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న రాంచరణ్ మొత్తం ఆస్తులు విలువ రూ.1300 కోట్లు అని ఆంగ్ల వెబ్‌సైట్ లెక్క కట్టింది. దాంతో రాంచరణ్ ఆస్తుల విలువ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశను కలిగించింది. ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్‌‌తో కలిసి రాజమౌళి రూపొందించే RRR చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X