Ram Charan : పండగపూట ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ ఖుషి.. గేమ్ ఛేంజర్ అప్‌డేట్‌తో క్రేజీగా!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్‌కు ఇదే స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అప్పట్లో జరగండి.. జరగండి సాంగ్ మినహా ఈ సినిమా నుంచి మరే మేజర్ అప్‌డేట్ రాలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏదైనా ట్రీట్ ఇస్తారనుకుంటే అదీ లేకపోవడంతో అభిమానులు డల్ అయ్యారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చరణ్ ఈ సినిమాపై కీలక అప్‌డేట్ ఇచ్చారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. అయితే ఈ సినిమాను పక్కకుపెట్టి భారతీయుడు-2ని కంప్లీట్ చేశారు శంకర్. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని, మరెన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు -2 డిజాస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్‌పై అందరి దృష్టి పడింది. ‌ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా బెటర్ ఔట్‌పుట్‌పై శంకర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఫిలింనగర్ టాక్.

ram charan s shankar s game changer movie second song to be release in september

ఇప్పటికే సినిమా ఆలస్యం కావడంతో శంకర్ ఇంటా బయటా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేయాలని ఈ స్టార్ డైరెక్టర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్‌కు కథను అందించగా.. దిల్‌రాజు దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ విషయానికి వస్తే .. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిల్మ్ రూ.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. దీంతో గేమ్ ఛేంజర్ ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్‌తో చరణ్ భారీ బ్లాక్‌బస్టర్ కొట్టి ఉండటం, పైగా శంకర్ టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఓవర్సీస్ రైట్స్‌కు మంచి ధర పలికిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఇకపోతే వినాయక చవితి సందర్భంగా చిరంజీవి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ చరణ్‌, ఉపాసన తమ కుమార్తె క్లీన్ కారాతో కలిసి వినాయక చవితి పూజలు నిర్వహించారు. ఇక పండుగ సందర్భంగా తన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మెగా పవర్‌స్టార్. ఈ నెలలో గేమ్ ఛేంజర్ నుంచి సెకండ్ సింగిల్ తీసుకొస్తామని చరణ్ స్వయంగా ట్వీట్ చేస్తూ ఓ పోస్టర్ పెట్టాడు. బాబాయ్ పవన్ కళ్యాణ్ మాదిరిగా తలకు ఎర్ర తువాలు కట్టుకుని చరణ్ మాస్ స్టెప్స్ వేస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వందలాది మంది డ్యాన్సర్స్ ఉన్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనుకుంటే సాంగ్ వదుల్తామని చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు.

More from Filmibeat

Read more about: ram charan shankar game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X