తీవ్ర ఇబ్బందుల్లో రామ్ చరణ్ వ్యాపార సంస్థ.. నిలిపివేస్తున్నట్టు ప్రకటన.. అసలు ఏమైందంటే?
రామ్‌చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థ ట్రూ జెట్ పేరుతో విమానాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే అసలు ఎందుకు విమానాలు నిలిపివేసింది? అసలు ఏం జరిగింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

2015లో ప్రారంభం
రామ్‌చరణ్ తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ట్రూ జెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారు. ట్రూజెట్ విమాన సర్వీసులు జులై 12, 2015లో ప్రారంభం అయ్యాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి కేటీఆర్, టర్బో మేఘా సంస్థ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్, వి. ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రూజెట్ విమాన సర్వీసులను రామ్ చరణ్ తేజ్ జెండా ఊపి ప్రారంభించారు.

‘ఉడాన్’ పథకం
దేశంలో ఇది నాలుగో ప్రాంతీయ విమానయాన సంస్థగా ప్రారంభించబడింది. ఇలాంటి సంస్థలు మరిన్ని వస్తే విమానయానం ప్రజలకు మరింత చేరువ అవుతుందని కూడా అప్పట్లో భావించారు. అయితే ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో ట్రూజెట్ తమ సేవలు నిలిపివేసింది. నిజానికి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమాన సర్వీసులను దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఉడాన్' పథకం కింద అత్యధికంగా విమాన సేవలు అందిస్తున్న సంస్థల్లో ట్రూజెట్ ఒకటి కాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు కరోనా పెను ప్రమాదంగా మారింది.

మళ్లీ ట్రూజెట్ సేవలు
దీంతో పరిపాలనా పరమైన, సాంకేతిక కారణాల వల్ల సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేసింది. అయితే, త్వరలోనే మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ వి.ఉమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని, మరికొన్ని రోజుల్లో ఫైనల్ అవుతాయని ఉమేశ్ పేర్కొన్నారు. అంతే కాక ఈ పెట్టుబడితో పాటు కొత్త యాజమాన్యం కూడా వస్తుందని, ఈ క్రమంలో కొత్త సీఎఫ్ఓగా యోగ నరసింహన్‌ను నియమించినట్టు తెలిపారు. అలాగే, కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందని పేర్కొన్నారు. న్నారు. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో ట్రూజెట్ సేవలు మళ్లీ ప్రారంభమవుతాయని, దాని బ్రాండ్‌ను నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఉమేశ్ పేర్కొన్నారు.

నష్టాలు రావడంతోనే
ట్రూజెట్ ప్రకటన ఒకలా ఉంటే ఈ కు విరుద్ధంగా, సేవల సస్పెన్షన్ వెనుక ప్రధాన కారణం పెరుగుతున్న నష్టాలు అని అంటున్నారు. పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం, ట్రూజెట్ 2021 ఆర్థిక సంవత్సరానికి రూ. 143 కోట్ల నష్టాలు పొందగా, 2020లో రూ. 10.1 కోట్లు మరియు 2019లో రూ. 17.56 కోట్లుగా ఉంది.సంస్థ ఇబ్బందుల్లో ఉండడం వలనే రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ముంబైలోనే మకాం వేశారు అని సమాచారం. సోదరి శ్రీజతో కలిసి ముంబై వెళ్లిన రామ్ చరణ్ అక్కడే చాలా రోజుల పాటు ఉన్నారు. అసలు చరణ్ సోదరితో కలిసి ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఏ పని మీద ఇద్దరు కలిసి వెళ్లారు అంటూ రకరకాలుగా చర్చలు జరిగాయి. ఆ సమయంలో కొందరయితే ముంబైలో కొత్త బిజినెస్ అని కూడా అన్నారు. మరికొందరు బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుపుతున్నాడు అని కూడా అన్నారు.

ఆ పని మీదనే ముంబైలో
కానీ అసలు విషయం వేరే ఉందని ఇప్పుడు తెలిసింది. ఈ ట్రూ జెట్ సంస్థను టాటా గ్రూప్ కు ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవడం కోసం రామ్ చరణ్ అక్కడికి వెళ్లారట. ఇటీవలే టాటా గ్రూప్ సంస్థ భారీ మొత్తంలో బిడ్ వేసి ఎయిర్ ఇండియా సంస్థ దక్కిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రామ్ చరణ్ తనకు చెందిన ట్రూ జెట్ విమానయాన సంస్థను టాటా ఎయిర్ ఇండియా సంస్థతో కలిపి వ్యాపారం చేయడానికి వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించడానికి ప్లాన్ చేశారని తెలిసింది. కానీ అవేవీ వర్కౌట్ కాకపోవడంతో ఆయన మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని RC 15 అని సంభోదిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా షూట్ లో ప్రస్తుతం రామ్ చరణ్ పాలు పంచుకుంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆయన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











