‘వినయ విధేయ రామ’... రామ్ చరణ్ సీక్రెట్ వెల్లడించిన ఉపాసన, ఇవి తింటే...
'వినయ విధేయ రామ' మూవీ పోస్టర్లలో రామ్ చరణ్ కండలు తిరిగిన శరీరంతో అదిరిపోయే లుక్‌తో కనిపించాడు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఓ పోస్టర్లో ఒంటిపై టాటూలతో రామ్ చరణ్ ర్యాంబో లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఆ లుక్ వెనక ఉన్న రహస్యం ఉపాసన బయట పెట్టారు.
ఆ లుక్ కోసం రామ్ చరణ్ ఏం తిన్నాడు, డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉన్నారు? అనేది ఆమె ట్విట్టర్ ద్వారా వివరించారు. ఈ డైట్ ఫాలో అవుతూ అందుకు తగిన విధంగా వ్యాయామం చేస్తే మీరూ రామ్ చరణ్ మాదిరిగా ఫిట్‌గా తయారవ్వొచ్చు!

హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లేన్
రామ్ చరణ్ మాదిరిగా శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లేన్ తప్పనిసరి అంటోంది ఉపాసన. 21 రోజుల పాటు రామ్ చరణ్ ఈ డైట్ ఫాలోయినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు?
ఉదయం 8 గంటలకు: 3 ఎగ్ వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, 3/4 కప్ ఓట్ మీల్ విత్ ఆల్మండ్ మిల్క్
ఉదయం: 11.30 గంటకు ఒక పెద్ద కప్పు కూరగాయల సూప్.
మధ్నాహ్నం 1.30గంటలకు 200 చికెన్ బ్రెస్ట్, 3/4 బ్రౌన్ రైస్, 1/2 గ్రీన్ వెజిటబుల్ కర్రీ
సాయంత్రం 4 గంటలకు 250 గ్రాముల గ్రిల్డ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, 1/2 కప్ గ్రీన్ వెజిటబుల్
సాయంత్రం 6 గంటలకు: గ్రీన్ సలాడ్, అవాకాడో, నట్స్

ఏవి తినాలి? వేటికి దూరంగా ఉండాలి
కార్పొహైడ్రేట్స్, ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి, కూరగాయల ఎంపిక లాంటి విషయాలను వెల్లడిస్తూ ఉపాసన ఓ ఫోటో షేర్ చేశారు.

రాకేష్ ఉదియార్
ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేష్ ఉదియార్.... రామ్ చరణ్ కోసం ఈ ఫిట్ నెస్ ప్రోగ్రామ్, డైట్ డిజైన్ చేశారు. ‘వినయ విధేయ రామ' సినిమా విషయానికొస్తే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ . డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











