'మిస్టర్ మజ్ను' ట్రైలర్‌పై రాంచరణ్ కామెంట్!

అక్కినేని యువ వారసుడు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను విడుదలకు సిద్ధం అవుతోంది. అఖిల్ కు ఇది మూడవ చిత్రం. వెంకీ అట్లూరి దర్శత్వం వహించిన ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొంది ఉంది. అఖిల్ లవర్ బాయ్ గా కూల్ లుక్ లో అదరగొడుతున్నాడు. టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 25 మిస్టర్ మజ్ను చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మిస్టర్ మజ్ను ట్రైలర్ పై కామెంట్ చేశాడు.

మిస్టర్ మజ్ను ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. అఖిల్, నిధి అగర్వాల్, వెంకీ అట్లూరి, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని రాంచరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మిస్టర్ మజ్ను చిత్రీకరణ సందర్భంగా కూడా రాంచరణ్ ఈ చిత్ర సెట్స్ ని సందర్శించాడు.

Ram Charan says Akhils Mr Majnu trailer is promising

అమ్మాయిలతో రొమాన్స్ చేసే రోమియో తరహాలో అఖిల్ పాత్ర ఈ చిత్రంలో ఉండబోతోంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ అఖిల్ తో రొమాన్స్ చేస్తోంది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల్, హలొ చిత్రాలు పరాజయం చెందడంతో అఖిల్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకున్నాడు. మిస్టర్ మజ్ను చిత్రం ఏస్థాయి విజయం సాధిస్తుందో జనవరి 25న తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X