ఫొటో అడిగితే ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. పవర్ స్టార్, మెగాస్టార్ సర్ ప్రైజ్ అంటూ..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శనివారం 36వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఒకరోజు ముందుగానే అభిమానులు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలను స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పటికే రామ్ చరణ్ బర్త్ డే కామన్ డిస్ ప్లే పిక్ వైరల్ అయ్యింది. ఇక అభిమానులు కలవడానికి ఇంటివరకు రావడంతో రామ్ చరణ్ వారితో సెల్ఫీ దిగాడు. అంతే కాకుండా సినిమాకి సంబంధించిన విశేషాలను కూడా చెప్పాడు.

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమయ్యింది. చివరగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక నెక్స్ట్ అందరి ఫోకస్ RRR పైనే పడింది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇద్దరు అగ్ర హీరోలు చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం కేవలం టాలీవుడ్ జనాలే కాకుండా నార్త్ ఆడియేన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

RRR మోషన్ పోస్టర్
ఇక శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే RRR మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. మొదట్లో టీజర్ ఏదైనా వస్తుందేమో అనేంతలా రూమర్స్ అయితే వచ్చాయి. ఇక ఫైనల్ గా మోషన్ పోస్టర్ మాత్రమే రాబోతోంది అంటూ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

అభిమానులతో సెల్ఫీ
ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. దీంతో మెగా పవర్ స్టార్ కొంతసేపు వారితో మాట్లాడారు. ఇక ఫొటో అడిగితే అందరితో ఒక సెల్ఫీ దిగి హ్యాపీ చేశాడు. రామ్ చరణ్ ఒక్క సెల్ఫీలొనే అభిమానులందరిని కవర్ చేసేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్ ప్రైజ్ కూడా ఉంది..
ఇక అభిమానులతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచుట్టున్నట్లు చెప్పారు. వకీల్ సాబ్ ట్రైలర్ ను మీ అందరికంటే ముందు నేనే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పిన రామ్ చరణ్ శనివారం మెగాస్టార్ చిరంజీవి ఆచార్యకు సంబంధించిన సర్ ప్రైజ్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.


Click it and Unblock the Notifications











