రామ్ చరణ్ భారీ బహుమతి.. అది చూసి భయపడ్డ హీరోయిన్
Ram Charan: సాధారణంగా మనం ఎవరికైనా ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి , మన ఫిలింగ్ ను షేర్ చేసుకోవాడానికి బహుమతిని ఇస్తాం. ఈ బహుమతి ప్రత్యేకంగా ఉండాలి భావిస్తాం. అందుకే ఎవరైనా చాలా క్రియేవిట్ ఆలోచిస్తూ.. బహుమతిని ఇస్తున్నారంటూ.. అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా ఇన్నోవెటిగా ఆలోచించారు. ఓ స్టార్ హీరోయిన్ కూతురుకి ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి.. ఆ హీరోయిన్ కూడా చాలా భయపడిందంట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎంటీ? ఆ హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి.
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్. ఆమె కూతురుకు రామ్ చరణ్ ఓ భారీ బహుమతిని పంపించారట. ఆమె మాటల్లోనే తెలుసుకోండి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన 'జిగ్రా' సినిమా ఈ నెల 11న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ క్రమంలో యాంకర్ సుమతో ప్రమోషన్ ప్రొగ్రామ్ నిర్వహించారు. ఈ స్పెషల్ షోలోయాంకర్ సుమ కొన్ని హిడెన్ ఫోటోలను చూపిస్తూ.. బ్యాక్ సైడ్ ఉన్న స్టార్స్ ఎవరో కనుక్కోవాలంటూ ఓ ఫన్నీ టాస్క్ నిర్వహించింది.

ముందుగా రామ్ చరణ్ తన సిస్టర్స్ తో ఉన్న ఫోటోను చూపించారు. కానీ, రామ్ చరణ్ కనిపించకుండా హైడ్ చేశారు. ఆ హిడెన్ పర్సన్ ఎవరు? అంటూ సుమ ప్రశ్నించగా.. నానా తంటాలు పడి చివరకు రామ్ చరణ్ అంటూ సరైన సమాధానం ఇచ్చింది అలియా భట్. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో జరిగిన కొన్ని ఫన్ని మూమెంట్స్ ను షేర్ చేసుకుంది. అదే సమయంలో హీరో రామ్ చరణ్ తో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ ను చెప్పుకొచ్చింది. తనకు కూతురు పుట్టినప్పుడు రామ్ చరణ్ ఎవరు ఊహించని గిఫ్ట్ పంపించాడంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది అలియా.
అదొక విచిత్రమైన అనుభవం. తన అసిస్టెంట్స్ తన దగ్గరికి వచ్చి.. ' మేడమ్ ఎలిఫెంట్.. ఎలిఫెంట్' అంటూ తన దగ్గరికి పరుగులు తీస్తూ వచ్చారు. ఎలిఫెంట్ రావడం ఏంటని నేను కూడా ఆశ్చర్యపోయాను. అసలు ఎవరు పంపించారు? అని అడిగితే.. 'రామ్ చరణ్ సార్ మీకోసం ఎలిఫెంట్ పంపించారు' అంటూ తీసుకవచ్చిన వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎవరైనా ఊహించగలరా? ఏనుగును గిఫ్టుగా ఇవ్వాలనుకుంటారా? అది కూడా మన ఇంట్లోకి ఎలిఫెంట్ వస్తే ఎలా ఉంటుంది? నిజంగా దాన్ని చూసి..తొలుత నేను చాలా షాక్ అయ్యానను. ' అంటూ ఇంట్రెస్టింగ్ చెప్పింది.

అలియా ఇంకా కంటిన్యూ చేస్తూ..' కానీ, అది నిజమైనాఎలిఫెంట్ కాదని, చెక్కతో తయారు చేసిన భారీ సైజు బొమ్మ' అంటూ అసలు విషయం తనకు కుడా తర్వాతే తెలిసిందని అన్నారు.తొలుత తన కూతురు కూడా దాన్ని చూసి భయపడిందని, తర్వాత దాన్ని చూస్తూ ఆడుకోవడం ప్రారంభించింది 'అంటూ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ అలియా.
ఇదిలా ఉంటే. అలియా, రామ్ చరణ్ జంట ఆర్ ఆర్ ఆర్ మూవీలో కలిసిన నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అలియా సీత పాత్రలో నటించి.. తెలుగు ప్రేక్షకులనే కాదు.. ఇండియా వైడ్ గా మంచి గురింప్తు పొందింది. మరోసారి జిగ్రా అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అలియా.


Click it and Unblock the Notifications











