నా దృష్టిలో, ఫాన్స్ దృష్టిలో బాబాయి ఇలాగే ఉంటాడు: రామ్ చరణ్ పోస్ట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించిన పాట రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. నా దృష్టిలో, లక్షలాది ఫాన్స్ దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు తన మద్దతు ప్రకటిస్తూ... రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి మెగా అభిమానులను ఇది మరింత దగ్గర చేస్తుందని భావిస్తున్నారు.

రామ్ చరణ్ ప్రచారం మొదలైంది
ఈ పోస్టు ద్వారా జనసేన పార్టీకి రామ్ చరణ్ ప్రచారం మొదలైందని, సోషల్ మీడియా ద్వారా మెగాపవర్ స్టార్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాడని.... ఇది మున్ముందు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని టాక్.

అభిమానులను ఏకం చేయడమే లక్ష్యంగా...
రామ్ చరణ్ సోషల్ మీడియా పోస్టు చూస్తుంటే... మెగా అభిమానులందరినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా మరింతబలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఆకట్టుకుంటున్న లిరిక్స్
ఆర్‌కె(అంజి బాబు) రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. వరికుప్పల యాదిగిరి ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు స్వయంగా పాడారు. ఈ పాట మెగా అభిమానులు, జనసైనికుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.

రామ్ చరణ్
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చిరంజీవి ప్రధాన పాత్రలో ‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్నిభారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











