ఇండియన్ 2 డిజాస్టర్.. రాంచరణ్‌ షాకింగ్ నిర్ణయం.. దిల్ రాజు లాభపడేలా?

By Lekhaka

గత కొన్నేళ్లుగా అగ్ర దర్శకుడు శంకర్ అంచనాలకు తగ్గట్టు సినిమాలను తీయడంలో విఫలం అవుతున్నాడని అంటున్నారు అభిమానులు. ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరకు ఇండియన్ 2 మూవీతో జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీతో శంకర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ ఉంటుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. ఆ డెసిషన్ ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌ ఆ తర్వాత చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్ కావడంతో ఈ పొలిటికల్ డ్రామాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అలాగే గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుందని చెర్రీ నమ్మకంగా ఉన్నాడు. దాదాపు మూడేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కానీ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ ద్వారా రామ్ చరణ్ కోట్లు నష్టపోయాడని వార్తలు విన్పిస్తున్నాయి.

Ram Charan shocking decision about Game Changer Remuneration after Indian 2 Disaster

ముందుగా రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుందాం అని చెర్రీ అనుకున్నాడని, కానీ ఇప్పుడు ఇండియన్ 2 రిజల్ట్ ను చూసి మనసు మార్చుకున్నాడని టాక్ నడుస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత దిల్‌ రాజు, హీరో, దర్శకుడు సినిమాకు జరిగిన బిజినెస్ నుండి ఒక్కొక్కరు 33% వాటాను తీసుకోవాలనుకున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పారితోషికం 40 కోట్లు, 33% వాటాను తీసుకోవాలనుకున్నారని టాక్ విన్పిస్తోంది.

ఈ బిజినెస్ లో థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ తో పాటు ఇతర హక్కులు కూడా ఉంటాయి. ఇలా చేయడం వల్ల శంకర్‌కి, హీరో రామ్ చరణ్‌కి నిర్మాత వెంటనే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. ఆ డబ్బును సినిమాలో పెట్టుబడి పెట్టవచ్చని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ ప్రాజెక్ట్ 400 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మొదట అనుకున్నట్టుగా షేర్ కాకుండా మొత్తంగా రెమ్యూనరేషన్ తీసుకుంటానని నిర్మాత దిల్ రాజుతో అన్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం దిల్ రాజు గేమ్ ఛేంజర్ కోసం 90 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్టు సమాచారం. కానీ అదే షేర్ తీసుకుంటే 15 నుంచి 20 కోట్లు అదనంగా చెర్రీకి లాభం వచ్చేదని అంటున్నారు.

అయితే పెరిగిన బడ్జెట్, పెట్టుబడి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చూస్తే చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతకు మంచిదని చెబుతున్నారు. ఈ తిరిగి రెమ్యూనరేషన్ విషయంలో కొత్త డీల్ కుదుర్చుకున్నారట. దీంతో దిల్ రాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని అంటున్నారు. కాగా గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రి పాత్ర నుంచి కథను చూపించారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సన్నివేశం ప్రేక్షకులకు నచ్చేలా ప్లాన్ చేశారు. పాత్రకు మేకప్, నటన వినూత్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ పాత్రకు చరణ్‌కి జాతీయ అవార్డు రావచ్చు అనే అంచనాలతో ఉన్నారు మెగా ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: ram charan indian 2 game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X