Happy Birthday Akira: తమ్ముడితో ఉన్న అనుబంధంపై రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్.. ఫ్యాన్స్ ఫిదా!
మెగా హీరోలు వెండితెరపై ఎంత స్టార్ హోదా తో కనిపించినా కూడా పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ లో మాత్రం అందరితోనూ బ్రదర్ బాండింగ్ చాలా ఈక్వల్ గా ఉంటుంది. బయట రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా మెగా ఫ్యామిలి అన్యోన్యంగా ఉంటారని వారికి సంబంధించిన ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి పెద్ద కుమారుడిగా ఒకవైపు స్టార్ ఇమేజ్ ను అలాగే మరొకవైపు సోదరుడిగా తన బాధ్యతను సమానంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తన తమ్ముడు జూనియర్ పవర్ స్టార్ తో కూడా రామ్ చరణ్ చాలా క్లోజ్ గా ఉంటాడు అని అర్థం అవుతోంది. ఇక నేడు అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అభిమానుల ఎదురుచూపులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ నేటితో 18వ వసంతంలోకి అడుగుపెట్టాడు. టీనేజ్ వయసు నుంచే అడల్ట్ గా మారిన జూనియర్ పవర్ స్టార్ ఇప్పుడు అభిమానుల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక అతని టాలీవుడ్ ఎంట్రీ కోసం కూడా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. కానీ ఇంకా అకిరా నందన్ ఎంట్రీ పై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు.

కనిపించేది చాలా తక్కువ..
అయితే అకీరానందన్ మెగా ఫ్యామిలీతో చాలా తక్కువ బాండింగ్ ఉంది అని కామెంట్స్ కూడా బయట చాలా సార్లు వచ్చాయి. సాధారణంగా ఎల్లప్పుడు మెగా బ్రదర్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి కానీ అందులో అకీరా కనిపించేది చాలా తక్కువ. ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే అకిరా నందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాడు.

స్పెషల్ అట్రాక్షన్
ఆ మధ్య నిహారిక పెళ్లి వేడుకలో అకీరానందన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హీరోలలో అందరి కంటే ఎక్కువ ఉన్న వరుణ్ తేజ్ కంటే కూడా అకీరా మరింత ఎక్కువ హైట్ కలిగి ఉండటం విశేషం. అతను టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం తప్పకుండా మంచి స్టార్ గా ఎదుగుతాడు అని చెప్పవచ్చు.

రామ్ చరణ్ తో అనుబంధం
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కూడా అకీరా అనుబంధం ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా కొంతమందిలో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక ఈ రోజు అకిరా నందన్ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశాడు తమ్ముడు తో ఉన్న అనుబంధం గురించి రామ్ చరణ్ తేజ్ పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు.
మా బంధం మరింత బలంగా..
ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ అకీరానందన్ తో మా బంధం మరింత బలపడుతుంది అంటూ అతన్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని రామ్ చరణ్ ప్రేమగా తెలియజేశాడు. అంతే కాకుండా ప్రత్యేకంగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్ గా మారిపోతుంది.

మెగా ఎంట్రీ?
ఆ మధ్య కాలంలో అయితే అకీరానందన్ ను రామ్ చరణ్ తేజ్ తన కొణిదెల ప్రొడక్షన్ లోనే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ తలుచుకుంటే మాత్రం ఆ పని నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పవచ్చు. కానీ ఇంకా అకీరానందన్ సినిమాల వైపు రావాలని అనుకోవడం లేదు అని రేణుదేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారు. మొదట అలా వద్దు అనుకున్న వైష్ణవి కూడా చివరికి మంచి హీరోగా మంచి గుర్తింపు అందుకుంటున్నాడు. ఇక అభిమానులు అయితే అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి అతను సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











