RRRలో ఎవరు ఎక్కువ.. ఆ ప్రశ్నకు బాలీవుడ్ మీడియాకు స్వీట్ కౌంటర్ ఇచ్చిన చరణ్!

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ RRR బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది. బాహుబలి రికార్డులను కూడా తిరగరాస్తున్న ఈ సినిమా ఈ వారం కూడా సాలిడ్ వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ను కాస్త ఎక్కువగా హైలెట్ చేశారు అని.. జూనియర్ ఎన్టీఆర్ ను కాస్త తక్కువగా చూపించారు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

ఇక అదే ప్రశ్న బాలీవుడ్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సినిమాలో రామ్ చరణ్ ఎక్కువగా హైలెట్ అయ్యాడు అనే ప్రశ్నపై రామ్ చరణ్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

వెయ్యి కోట్లు

వెయ్యి కోట్లు

RRR సినిమా మొత్తానికి వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కు చేరుకున్నట్లుగా ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి సినిమాపై మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

చరణ్ ను ఎక్కువగా హైలెట్ చేసి..

చరణ్ ను ఎక్కువగా హైలెట్ చేసి..

అయితే ఈ సినిమాలో కొంతమంది అభిమానులు ఒక విషయంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలు తీస్తే ఇలాంటి కామెంట్స్ రావడం కూడా సర్వసాధారణం. ఒకరిని తక్కువగా చూపించారు అని ఒకరిని ఎక్కువ చూపించారు అనే అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. RRR లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ను తక్కువగా చూపించారని రామ్ చరణ్ ను కాస్త ఎక్కువగా హైలెట్ చేసినట్లుగా చాలా కామెంట్స్ వచ్చాయి.

ఎన్టీఆర్ హ్యాపీ

ఎన్టీఆర్ హ్యాపీ

నిజానికి దర్శకుడు రాజమౌళి కథ పరంగా అనే ఇద్దరు హీరోలను హైలెట్ చేశాడు అని చెప్పవచ్చు. ఒక విధంగా రామ్ చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలిచినప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ను అయితే తక్కువ ఏమి చూపించలేదు. ముఖ్యంగా కొమరం భీముడో అనే పాటలో తారక్ నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. తన కెరీర్లోనే ఈ సినిమాను ఎప్పుడు మర్చిపోలేను అని ఎన్టీఆర్ కూడా తన పాత్రపై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందినట్లు అభిప్రాయాన్ని చెప్పాడు.

బాలీవుడ్ మీడియాలో..

బాలీవుడ్ మీడియాలో..

ఇక హీరోలు సంతృప్తి చెందినప్పటికీ కూడా ఓ వర్గం అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ను తక్కువగానే చూపించారని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక విధంగా అభిమానులలో అలాంటి సందేహాలు కలగడం సర్వసాధారణం. కానీ మీడియాలో కూడా ఇలాంటి సందేహాలను వెతుక్కోవడం కరెక్ట్ కాదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ మీడియా కూడా అదే ప్రశ్నను చిత్ర యూనిట్ ని అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Recommended Video

Who Is Twinkle Sharma, The Malli of SS Rajamouli's RRR Movie | Filmibeat Telugu
 చరణ్ స్వీట్ కౌంటర్

చరణ్ స్వీట్ కౌంటర్

ఈ సినిమాలో అన్ని ఘనతలను కూడా రామ్ చరణ్ కొట్టేశాడు అని ఒక విలేకరి చెప్పడంతో చరణ్ వెంటనే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అన్నాడు. ఈ సినిమాలో మేము ఇద్దరం కూడా చాలా బాగా నటించాము. ఈ సినిమాకు నేను ఆస్వాదించినంత మరే ఇతర సినిమాలకు కూడా అలాంటి అనుభూతిని పొందలేదు. తారక్ తో ఈ సినిమాలో మంచి ప్రయాణం కొనసాగింది. అదే నాకు అత్యుత్తమమైన విషయం. దీనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు రాజమౌళి కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చరణ్ స్వీట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X