RC15: రామ్ చరణ్ కిల్లర్ వర్కౌట్స్.. జిమ్ వీడియో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో మొత్తానికి పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక నెక్స్ట్ సినిమాతో కూడా అతను మంచి సక్సెస్ అందుకునే అవకాశం అయితే ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ 15వ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నారు.
ఇక రాబోయే షెడ్యూల్లో రామ్ చరణ్ తేజ్ కీలకమైన యాక్షన్ సన్నివేశాలలో నటించబోతున్నాడు. అయితే అందులో ఫిట్నెస్ విషయంలో కొంత మార్పులు చేయాలని దర్శకుడు కోరడంతో రామ్ చరణ్ తేజ మళ్లీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ తేజ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఫస్టాఫ్లో ఒక ప్రభుత్వ అధికారిగా ఆ తర్వాత ఒక ఐపీఎస్ అధికారిగా విభిన్నమైన షేడ్స్ లో అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ పోస్ట్ చేసిన కిల్లింగ్ వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. అందులో రామ్ చరణ్ తేజ్ వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే శంకర్ రామ్ చరణ్ ను మరింత పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నట్లు కూడా అనిపిస్తోంది. తన జిమ్ ట్రైనర్ తో ఆదివారం ఉదయం చాలా ఎనర్జిటిక్ గా వర్కౌట్స్ మొదలు పెట్టినట్లు రామ్ చరణ్ తేజ సోషల్ మీడియా లో అయితే ఒక వివరణ ఇచ్చాడు. ఇక అభిమానులు అయితే వారికి ఇష్టమైన హీరో కష్టపడుతున్న విధానాన్ని చూసి చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక శంకర్ సినిమా అనంతరం రామ్ చరణ్ తేజ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











