హాట్‌స్టార్ కోసం రామ్ చరణ్ స్పెషల్ మ్యాజిక్.. ఫొటోతో సరికొత్త సర్‌ప్రైజ్‌.. రెమ్యునరేషన్ ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఆయన నేషనల్ లెవెల్ లో బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడానికి కూడా సిద్ధమయ్యారు. రామ్ చరణ్ తేజ్ ఇటీవల కాలంలో ఎక్కువగా అయితే కమర్షియల్ ప్రకటనలో పెద్దగా కనిపించలేదు. కేవలం నచ్చితేనే వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. గతంలో పెప్సీ ఎయిర్టెల్ హ్యాపీ వంటి ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు కూడా ప్రత్యేకమైన ప్రమోషనల్ బాధ్యతలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ కూడా షూట్ చేసినట్లు తెలిసిపోయింది. అందుకు సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోను రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్

బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్

రామ్ చరణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో వినయ విధేయ రామ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత కరోనా ఎక్కువ కావడంతో RRR సినిమా వాయిదా పడుతూనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ గా తెరపైకి రానున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

మార్కెట్ పెంచుకునే విధంగా..

మార్కెట్ పెంచుకునే విధంగా..

ఎలాంటి సినిమా చేసినా కూడా తన మార్కెట్ ను పెంచుకునే విధంగా రామ్ చరణ్ అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా RRR సినిమా అనంతరం ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల లాంచ్ అయిన ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్..

అయితే ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే రామ్ చరణ్ మరొకవైపు ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతూ వస్తున్నాడు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో కొన్ని కంపెనీల్లో అగ్రహీరోలను సెలెక్ట్ చేసుకుంటు ప్రమోషనల్ యాడ్స్ తో హైప్ క్రియేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ తేజ్ కూడా ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొదటి యాడ్ లో చరణ్ తేజ్ మెజీషియన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సర్‌ప్రైజ్‌ రెడీ

సర్‌ప్రైజ్‌ రెడీ

యాడ్ కి సంబంధించిన ఒక ఫోటోను కూడా రామ్ చరణ్ తేజ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మీ స్క్రీన్‌లకు వినోద ప్రపంచాన్ని తీసుకురావడానికి సర్వం సిద్ధంగా ఉంది.. అంటూ ఒక సర్‌ప్రైజ్‌ రెడీ చేసినట్లు గా అర్థం అవుతోంది. యాడ్ ఇదివరకే పూర్తయింది. ఇక ఫోటోలో రామ్ చరణ్ తేజ్ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. తప్పకుండా ఏదో పెద్ద ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.

Recommended Video

Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగనున్న రామ్ చరణ్ తేజ్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది. దాదాపు మూడు కోట్ల వరకు డీలింగ్ సెట్ అయినట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. ఇదివరకే కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగిన రామ్ చరణ్ తేజ్ మొదటి సారి ఒక ఓటీటీ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ స్టార్ హోదా ఆ ఓటీటీ సంస్థకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X