మొన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు రామ్ చరణ్.. న్యూ స్టైలిష్ లుక్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మన హీరోల స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువగా వస్తుండటం విశేషం. ఒక విధంగా మన హీరోల మార్కెట్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా పెరుగుతోంది అనే చెప్పాలి. భవిష్యత్తులో అయితే ఆ సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత రాబోయే RRR సినిమా కూడా అంతకు మించి అనేలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని అందుకుంటుందని అర్ధమవుతోంది. ఇక రామ్ చరణ్ తేజ్ విజయ్ దేవరకొండ వంటివారు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

రౌడి స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కూడా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను హిందీలో కరణ్ జోహార్ భారీగానే విడుదల చేయబోతున్నాడు. ఇక దానికి తగ్గట్లు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇదివరకే విజయ్ దేవరకొండ ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీల ఫోటోగ్రాఫర్ డ‌బూ ర‌త్నానితో ప్రత్యేకంగా ఒక ఫోటో షూట్ చేసిన విషయం తెలిసిందే. డ‌బూ ర‌త్నాని ఎలాంటి ఫోటో షూట్ నిర్వహించిన కూడా వాటికి భారీ స్థాయిలో క్రేజ్ అందుతుంది. అప్పట్లో షారుఖ్ ఖాన్ నుంచి నేటి తరం హీరోల వరకు అందరూ కూడా అతనితో ఫోటో షూట్ చేసి చేయించుకునేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

Ram charan tej special photo shoot with dabboo ratnani After vijay devarakonda

ముఖ్యంగా క్యాలెండర్ ఫోటో షూట్ అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటూ ఉంటుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సౌత్ నుంచి మొదటి హీరోగా 2021 క్యాలెండర్ కోసం చేతులు డ‌బూ ర‌త్నానితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫొటో షూట్ చాలా స్టైలిష్ గా కొనసాగింది. విజయ్ దేవరకొండ చాలా కొత్తగా కనిపించాడు అని ప్రేక్షకుల నుంచి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా తనదైన శైలిలో ఫోటో షూట్ లో స్టిల్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. డ‌బూ ర‌త్నాని రామ్ చరణ్ తో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఈ ఫోటో షూట్ కూడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే లా ఉందని అర్థమవుతోంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ RRR టీజర్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఇక ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా మార్కెట్ కు తగ్గట్లుగానే విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తన 15 ప్రాజెక్టును ఇటీవల రామ్ చరణ్ మొదలుపెట్టాడు. ఇక అంతే కాకుండా గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల తో కూడా ఓ సినిమా చేసేందుకు చర్చలు జరిపాడు కానీ అవి ఇంకా ఫైనల్ కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X