రామ్ చరణ్ బాటలో కిచ్చా సుదీప్.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్!

సినీ సెలబ్రెటీల జీవితంలో భద్రత అనేది రోజురోజుకూ అత్యంత కీలక అంశంగా మారుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్ హీరోలు ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి, భారీ జనసందోహం, మీడియా హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ వ్యక్తిగత భద్రత కోసం ప్రత్యేక శిక్షణ పొందిన బాడీగార్డులను నియమించుకోవడం సాధారణ విషయంగా మారింది. అయితే తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. దేశీయ భద్రతా సిబ్బందికి బదులుగా విదేశీ బాడీగార్డులను నియమించుకోవడంపై స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది.

ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charam)పేరు వినిపిస్తోంది. ఇటీవల 'పెద్ది' సినిమా ప్రమోషన్ల సందర్భంగా రామ్ చరణ్ వెంట కనిపించిన భారీ కాయుడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే.. గాంబియా దేశానికి చెందిన కెవిన్ కుంట (Kevin Kunta). ఇటలీలో ప్రొఫెషనల్ ఎంఎంఏ (MMA)ఫైటర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులకు సెక్యూరిటీ అందించిన అనుభవం కెవిన్ కు ఉంది. ఇప్పుడు రామ్ చరణ్‌కు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నారు.

Ram Charan to Kichcha Sudeep Are Foreign Bodyguards the New Trend Among Stars

ముంబై, భోపాల్, బెంగళూరు, విజయవాడ వంటి నగరాల్లో జరిగిన 'పెద్ది'ప్రమోషనల్ ఈవెంట్లలో వేలాది మంది అభిమానుల మధ్య రామ్ చరణ్‌కు రక్షణగా నిలిచాడు కెవిన్. అతనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విదేశీ బాడీగార్డులపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కెవిన్‌కు రోజుకు రూ. 2 లక్షల వరకు పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు అదే తరహాలో శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep)కూడా విదేశీ బాడీగార్డ్‌తో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన పలు బహిరంగ కార్యక్రమాల్లో సుదీప్ వెంట ఇటలీకి చెందిన సెర్గియుజ్ వోలక్ (Sergius Volok) కనిపించారు. 6.4 అడుగుల ఎత్తు, 114 కిలో బరువు, స్ట్రాంగ్ బాడీ ఆయన సొంతం. సెర్గియుజ్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ తర్వాత విదేశీ బాడీగార్డ్‌ను వినియోగిస్తున్న మరో దక్షిణాది స్టార్‌గా సుదీప్ పేరు వార్తల్లో నిలిచింది.

సెర్గియుజ్ వోలక్ కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదు. ఆయన యాక్టర్, ఫిట్‌నెస్ మోడల్, జిమ్ ట్రైనర్, యూరోపియన్ ఫిజిక్ ఛాంపియన్‌గా కూడా గుర్తింపు పొందారు. గతంలో పలు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కూడా పని చేసినట్లు సమాచారం. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కిచ్చా సుదీప్‌కు భద్రత కల్పిస్తున్నానని స్పష్టం చేశారు. అయితే తన పారితోషికం గురించి మాత్రం వెల్లడించలేదు.

సినీ ప్రముఖుల భద్రత కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అల్లు అర్జున్, విజయ్, యష్ వంటి స్టార్ యాక్టర్స్ తమ వ్యక్తిగత భద్రత కోసం భారీ మొత్తాలను వెచ్చిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్టార్‌డమ్ పెరుగుతున్న కొద్దీ భద్రతా అవసరాలు కూడా పెరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ప్రతి కదలిక వైరల్ అవుతుండటంతో, భద్రతా సిబ్బందిపై బాధ్యతలు మరింత పెరిగాయి. ముఖ్యంగా అభిమానుల మధ్య అనుకోని పరిస్థితులు తలెత్తకుండా చూడటం, ఈవెంట్లలో భద్రతను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను ఈ బాడీగార్డులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే, విదేశీ బాడీగార్డులను నియమించుకోవడం ఇప్పుడు స్టార్ హీరోల్లో కొత్త ట్రెండ్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్‌తో ప్రారంభమైన ఈ ట్రెండ్ , ఇప్పుడు కిచ్చా సుదీప్ వరకు చేరింది. రాబోయే రోజుల్లో మరెంత మంది దక్షిణాది స్టార్ హీరోలు కూడా ఈ బాటలో నడుస్తారో అనేది వేచి చూడాలి.

Read more about: kichcha sudeep ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X