Ram Charan కు అరుదైన ఘనత.. అమెరికా పాపులర్ టాక్ షోలో మెగా పవర్ స్టార్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో హల్‌చల్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు కోసం RRR సినిమా ప్రమోషన్స్‌ కోసం వెళ్లిన ఆయన హాలీవుడ్ మీడియాను ఆకట్టుకొంటున్నారు. RRR సినిమాలో విభిన్నమైన పాత్రలో, విలక్షణమైన నటనతో విశ్వవ్యాప్తంగా జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకొన్న విషయం తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ కెరీర్‌లో మరో అరుదైన ఘనత చోటుచేసుకొన్నది. ఆ ఘనతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన గుడ్ మార్నింగ్ అమెరికా షో నుంచి రాంచరణ్ ఆహ్వానం అందింది. ఈ పాపులర్ షోలో రాంచరణ్ పాల్గొనేందుకు సిద్దమయ్యారు. RRR సినిమాతో హాలీవుడ్‌లో భారీ క్రేజ్ సంపాదించుకొన్న ఈ మెగా హీరోపై అమెరికా మీడియా దృష్టిపెట్టింది. ఈ పాపులర్ షోలో తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో పంచుకోనున్నారు. అభిమానులకు ఈ షో ట్రీట్‌గా మారడం ఖాయమైంది.

 Ram Charan to participate in Good Morning America show part of the RRRs Oscar Promotion

గుడ్ మార్నింగ్ అమెరికా షో భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి 11.30 గంటలకు ప్రసారం కానున్నది. అమెరికా కాలమానం ప్రకారం..మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అవుతుంది.

ఇక రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. RRR సినిమా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే బుచ్చిబాబుతోపాటు మరికొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X