RRR తర్వాత రామ్ చరణ్ చేసే మూవీపై క్లారిటీ.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ తరహా పాత్రలో మెగా హీరో.!

By Manoj

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'చిరుత'తో పరిచయం అయిన అతడు.. రాజమౌళి రూపొందించిన 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రెండో సినిమాతో అందరి దృష్టిలో పడిన చెర్రీ.. ఆ తర్వాత కూడా కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. దీని తర్వాత రామ్ చరణ్ నటించే సినిమా విషయంలో తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

తండ్రి కోసం రామ్ చరణ్ డుయల్ రోల్

తండ్రి కోసం రామ్ చరణ్ డుయల్ రోల్

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు రామ్ చరణ్ తేజ్. ఒకవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అతడు.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతగానూ మారాడు. చిరు కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'తో పాటు గత ఏడాది వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి'కి చెర్రీనే నిర్మాత. అలాగే, కొరటాల చేస్తున్న మూవీకి కూడా సహా భాగస్వామిగా ఉన్నాడు.

 అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్

గత ఏడాది రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. భారీ పరాజయం తర్వాత అతడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్నాడు. ఇందులో చెర్రీ.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

మరో మల్టీస్టారర్ మూవీకి పచ్చ జెండా

మరో మల్టీస్టారర్ మూవీకి పచ్చ జెండా

ప్రస్తుతం భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న RRRలో నటిస్తున్న రామ్ చరణ్.. అదే తరహా సినిమాకు పచ్చ జెండా ఊపాడని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆచార్య' అనే మూవీలో అతడు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడట. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమా కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.

Recommended Video

RRR | Audience Blown Away By Jr NTR Voice Over
ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్‌లో నిరాశ

ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్‌లో నిరాశ

RRR తర్వాత రామ్ చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్న దానిపై చాలా రోజులుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి, సుజిత్, హరీశ్ శంకర్, కొరటాల శివ సహా ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల అతడి పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటన ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.

 రామ్ చరణ్ తర్వాతి సినిమాపై క్లారిటీ

రామ్ చరణ్ తర్వాతి సినిమాపై క్లారిటీ

అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. రామ్ చరణ్ నటించే తర్వాతి సినిమాపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... చరణ్‌కు ఇటీవలే అనిల్ రావిపూడి ఓ కథను వినిపించాడట. దీనికి ఇంప్రెస్ అయిన అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ దర్శకుడు ఇటీవలే మహేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు' చేసిన విషయం తెలిసిందే.

 కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ తరహా పాత్రలో చెర్రీ

కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆ తరహా పాత్రలో చెర్రీ

అనిల్ రావిపూడి - చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తారని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలాగే, హీరోయిన్‌గా కియారాను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అతడి కెరీర్‌లో మొదటిసారి ఇందులో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కామెడీని పండించే పాత్రలో నటించబోతున్నాడట. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X