Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టైలిష్ డైరెక్టర్‌కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్.. మరో హిట్ కొడతారా.?
పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినప్పటికీ... అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో.. యాక్టింగ్‌లో మాత్రం సినిమా సినిమాకూ బాగా పరిణితి చూపిస్తున్నాడు. 'రంగస్థలం'లో అతడు చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసం.!
తండ్రి కోసం ద్విపాత్రాభినయం చేస్తున్న చరణ్
హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ క్రమంలోనే క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతగానూ మారాడు. ఆయన కమ్‌బ్యాక్ మూవీతో పాటు ‘సైరా: నరసింహారెడ్డి', ‘ఆచార్య'లకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
భారీ మల్టీస్టారర్‌లో భాగం.. రియల్ హీరో పాత్రలో
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రణం రౌద్రం రుధిరం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, తారక్.. కొమరం భీంగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
చిరంజీవికి గురువుగా మారిన రామ్ చరణ్
RRR షూటింగ్‌తో బిజీగా ఉన్న రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రలో.. చిరంజీవికి గురువుగా కనిపించబోతున్నాడని అంటున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిరు నక్సలైట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఆచార్యలో చరణ్ నటించేది అనుమానమే
ఇటీవల ప్రచారం అవుతోన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే... ‘ఆచార్య'లో రామ్ చరణ్ నటించేది అనుమానమే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి కారణం.. లాక్డౌన్ కారణంగా RRR షూటింగ్ వాయిదా పడడం.. రీస్టార్ట్ అయిన తర్వాత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అంటున్నారు. ఈ విషయాన్ని కొరటాల శివ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రసావించడం గమనార్హం.
ఎన్టీఆర్ అలా... రామ్ చరణ్ మాత్రం ఇలా
ప్రస్తుతం RRRలో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. కుదిరితే ‘ఆచార్య'లోనూ నటిస్తాడు. అయితే, ఆ తర్వాత అతడు ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఓ వైపు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే.. చరణ్ మాత్రం తన తదుపరి సినిమాను ప్రకటించడకపోవడంతో మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
స్టైలిష్ డైరెక్టర్‌కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్
చరణ్ తదుపరి సినిమా విషయంలో ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. అతడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన ప్రకటన జూన్ మొదటి వారంలో వస్తుందని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘ధృవ' అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.