ISPL: క్రికెట్ ప్రపంచంలోకి రామ్ చరణ్.. హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా మెగా హీరో
ఇండియాలో క్రికెట్‌కు, సినిమాకు ఉన్న ఆదరణ మరే దానికి ఉండదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు రంగాలతో ముడి పడిన ఎన్నో అంశాలు సెన్సేషన్ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది స్టార్లు క్రికెట్‌తో సంబంధం ఏర్పరచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ లీగ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. అదే సమయంలో ఓ టీమ్‌కు ఓనర్‌గానూ మారాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
క్రికెట్ ఫీవర్ రోజు రోజుకూ విస్తృతం అవుతోన్న నేపథ్యంలో కొత్త కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి సారిగా టెన్నిల్ బాల్ క్రికెట్‌ను పరిచయం చేయబోతున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ పేరిట దీన్ని మొదలు పెడుతున్నారు. పది ఓవర్ల లీగ్‌గా జరగనున్న దీన్ని వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు.

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)లో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్‌లు పోటీ పడబోతున్నాయి. మొత్తం ఈ లీగ్‌లో 19 మ్యాచ్‌లు జరిగేలా నిర్వహకులు ప్లాన్ చేశారు. ఇవన్నీ ముంబై నగరంలోనే షెడ్యూల్ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఐఎస్‌పీఎల్ కోర్ కమిటీ సభ్యుడు, బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ వెల్లడించారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)లో భాగంగా హైదరాబాద్ జట్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశాడు. తాజాగా ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్.. 'ఐఎస్‌పీఎల్ (ISPL)లో హైదరాబాద్ టీమ్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అన్నాడు.

ఇదే ట్వీట్‌లో రామ్ చరణ్ 'క్రికెట్‌కు అతీతంగా ఈ వెంచర్‌ను ప్రతిభను పెంపొందించడం, సమాజ స్ఫూర్తిని రగిలించడంతో పాటు స్ట్రీట్ క్రికెట్ యొక్క సారాంశాన్ని తెలియజేయడం కోసం తీసుకున్నాం. ISPLలో హైదరాబాద్ ఉనికిని పెంచుకుంటూ.. చిరస్మరణీయమైన క్షణాలను రూపొందించేందుకు మీరంతా నాతో చేరండి. ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోండి' అని కోరాడు.

ఇదిలా ఉండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు సనతో మూవీ చేయబోతున్నాడు. ఇలా సినిమాల పరంగానే కాకుండా రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాల్లోకి సైతం ప్రవేశించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











