For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శంకర్‌తో‌ రామ్ చరణ్ సీక్రెట్ మీటింగ్: ఆయనతో పాటు వాళ్లందరికీ థ్యాంక్స్.. శుభవార్త చెప్పేశారుగా!

  |

  మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రికి తగ్గ కుమారుడిగానే ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి రిజల్టుతో పని లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా దీని కోసం వీళ్లిద్దరూ సీక్రెట్‌గా కలిశారు. ఆ వివరాలను వెల్లడిస్తూ చరణ్ ట్వీట్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

  ఎన్టీఆర్‌తో కలిసి ఆ సినిమాలో చరణ్

  ఎన్టీఆర్‌తో కలిసి ఆ సినిమాలో చరణ్

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

  చిరంజీవికి సహాయం చేసేందుకు అలా

  చిరంజీవికి సహాయం చేసేందుకు అలా

  RRR షూటింగ్‌ జరుగుతుండగానే రామ్ చరణ్... మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే... తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య'లో. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో చరణ్ నక్సలైట్‌గా కనిపించనున్నాడు. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర చనిపోతుంది. ఆ రోల్‌కు సంబంధించిన పోస్టర్ కూడా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.

  శంకర్‌తో సినిమాను ప్రకటించిన హీరో

  శంకర్‌తో సినిమాను ప్రకటించిన హీరో

  కొన్ని రోజులుగా రామ్ చరణ్ నటించే తదుపరి సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో అతడు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

  ఆ గొడవల వల్ల ఆలస్యం అవుతుందని

  ఆ గొడవల వల్ల ఆలస్యం అవుతుందని

  శంకర్‌ చాలా ఏళ్ల క్రితమే కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2'ను ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. దీంతో రామ్ చరణ్‌తో శంకర్ చేసే సినిమా ఆలస్యం అవుతుందనుకున్నారు. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.

  శంకర్‌తో‌ సినిమాపై రామ్ చరణ్ ట్వీట్

  శంకర్‌తో‌ సినిమాపై రామ్ చరణ్ ట్వీట్

  శంకర్‌తో రామ్ చరణ్ చేయబోయే సినిమాపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు గురించి మరో క్లారిటీ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మెగా హీరో చెన్నై వెళ్లాడు. అక్కడ ఈ స్టార్ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా మంతనాలు జరిపాడు. ఈ విషయం చరణ్ ట్వీట్‌తో బయటకు వచ్చింది.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ ప్రకటన

  వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ ప్రకటన

  తాజాగా రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో శంకర్, దిల్ రాజుతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. అలాగే, ‘చెన్నైలో నిన్న ఎంతో అద్భుతమైన రోజు గడిచింది. మాకు చక్కని ఆతిథ్యం ఇచ్చిన శంకర్ సార్‌కు ఆయన కుటుంబానికి థ్యాంక్స్. మీతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మూవీ అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి' అంటూ పేర్కొన్నాడు. దీనిపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  English summary
  Mega Power Star Ram Charan Now Doing RRR Under Rajamouli Direction. After This he will do a film with S. Shankar. Now Charan Went Chennai and Tweet about This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X