జపాన్‌లో రాంచరణ్ మాస్ క్రేజ్.. RRR రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ రచ్చ!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మన హీరోలకు దేశమంతా అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. ముఖ్యంగా దర్శకులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఏకంగా హాలీవుడ్ ప్రముఖులు కూడా మన సినిమాలపై భారీ స్థాయిలో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. RRR లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన విధానం వివిధ దేశాల్లో కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఆ సినిమా అత్యధిక వ్యూవ్స్ అందుకున్న సినిమాగా గుర్తింపును అయితే అందుకుంది.
ఇక రాబోయే రోజుల్లో వివిధ దేశాల్లో కూడా RRR సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. వెండితెరపై చూస్తే ఆ ఫీలింగ్ మరొక రేంజ్ లో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని దేశాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ RRR సినిమాను హై లెవెల్ లోనే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదివరకే జపాన్ లో అయితే రామ్ చరణ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది.
అంతకుముందు రజనీకాంత్ కంటే హై రేంజ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక రామ్ చరణ్ అక్కడ అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న మొదటి ఇండియన్ హీరోగా కూడా గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా జపాన్లో నెంబర్ వన్ ఇండియన్ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు RRR సినిమాను కూడా అదే రేంజ్ లో అక్కడ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మగధీర సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అక్కడ ఆడియన్స్ కూడా ఆ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమా కూడా జపాన్లో మంచి క్రేజ్ అందుకోవడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో మన హీరోలు మిగతా దేశంలో కూడా సినిమా ప్రమోషన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications











