RC 16: రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ.. స్పీడ్ పెంచనున్న జెర్సీ డైరెక్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తో మొదటి సారి ఇండియా మార్కెట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరొక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇద్దరు హీరోలకు కూడా ఒక ప్రత్యేకమైన పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అడుగులు వేస్తున్నాడు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథలను సెర్చ్ చేస్తున్నాడు. కొత్త దర్శకుడు అయినా పర్వాలేదు అని కథ బాగుంటే మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఈ హీరో సిద్ధమవుతున్నాడు. ఇక రామ్ చరణ్ కెరీర్ మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. స్పోర్ట్స్ ఏదైనా పర్వాలేదు అని మంచి కథ దొరికితే మాత్రం ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా సరే హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పాడు. ఇక అనుకున్నట్లుగానే రామ్ చరణ్ కు టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఒక మంచి కథను చెప్పినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం వీరి కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గౌతమ్ తిన్ననూరి అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా బాలీవుడ్లో కూడా అతనికి మంచి క్రేజ్ అయితే వస్తుంది అని సినీ ప్రముఖులు నమ్ముతున్నారు. హిందీ జెర్సీ సినిమాను అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కూడా ఆయన చాలా సందర్భాల్లో రామ్ చరణ్ కు చెప్పాడట. ఇక గౌతమ్ తిన్ననూరి ఒక ప్రత్యేకమైన స్టోరీ లైన్ ను అల్లు అరవింద్ కు వినిపించడంతో అది ఆయన నుంచి రామ్ చరణ్ వరకు వెళ్ళింది.
కథ నచ్చడంతో రామ్ చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వీలైనంత త్వరగా పూర్తి స్క్రిప్ట్ పనులను కూడా సిద్ధం చేసుకోవాలి అని సూచించాడట. ఇక ఫైనల్ గా దర్శకుడు అయితే రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి ఉంచాడు. ఈ స్క్రిప్ట్ పై రెండు మూడు సార్లు చర్చలు జరిపిన తర్వాతనే రామ్ చరణ్ తేజ్ ప్రకటన ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై లో మొదలు పెట్టే అవకాశం ఉందట. ఇప్పటికే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమాను పాన్ ఇండియా రేంజ్ తగ్గట్టుగా రూపొందించనున్నట్లు సమాచారం. ఇక RRR సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15 సినిమాతో రానున్నాడు. అనంతరం గౌతమ్ తిన్ననూరితో 16వ సినిమాను పూర్తి చేసి సుకుమార్ దర్శకత్వంలో 17 వ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఈ మూడు సినిమాలు కూడా రామ్ చరణ్ కెరీర్లోనే ఒకదానికి మించి మరొకటి హై రేంజ్ లో తెరపైకి వస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications











