RC 16 నుంచి మరో ఆసక్తికరమైన లీక్.. ఒక నిజం, మరో అబద్ధం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన బ్రాండ్ ఇమేజ్ ని నేషనల్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్న సంగతి విదితమే. హాలీవుడ్ లో సైతం రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత రామ్ చరణ్ ఓ మూడు నెలల పాటు సినిమాలకి గ్యాప్ ఇస్తారు.
ఉపాసన గర్భంతో ఉండటంతో ఆమె డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారంట. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆర్.సి 16గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ ఒక స్పోర్ట్స్ మెన్ బయోపిక్ అంటూ కథనాలు వినిపించాయి. కోడి రామ్మూర్తి బయోపిక్ అంటూ చాలా రకాల కథనాలు వెలువడ్డాయి.

రియల్ లైఫ్ సంఘటనలని బేస్ చేసుకొని బుచ్చిబాబు ఈ కథని సిద్ధం చేసారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంట. ఈ కథ కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ అని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథనే అయిన కూడా దర్శకుడు మాత్రం సరికొత్త యాంగిల్ గా ఈ స్క్రిప్ట్ రెడీ చేసారంట.

అయితే ఏ స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ ఈ మూవీ కథ ఉంటుందనేది తెలియదు కానీ రామ్ చరణ్ పాత్ర మాత్రం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందంట. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి భిన్నమైన పాత్రలో చరణ్ కనిపిస్తారని టాక్. చెర్రీ కూడా బుచ్చిబాబు స్క్రిప్ట్ రంగస్థలం కంటే బాగుంటుంది అని ఇప్పటికే కామెంట్స్ చేశారు. ఈ స్పోర్ట్స్ నేపథ్యంలో కంప్లీట్ ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో బుచ్చిబాబు ఈ సినిమా కథని ఏ రేంజ్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా చెబుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట.


Click it and Unblock the Notifications











