RC 16 కోసం మరో ప్లాన్ సిద్ధం చేసిన బుచ్చిబాబు.. ఇక స్టార్ట్ అయ్యేది అప్పుడే..
రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను వీలైనంత తొందరగా మొదలుపెట్టాలి అని ఇప్పుడు రామ్ చరణ్ టీం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ ఏడాది మొదట్లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి. కానీ కథ విషయంలో చరణ్ కొన్ని మార్పులు అడగడంతో దర్శకుడు మరింత టైం తీసుకోవాల్సి వచ్చింది.
అంతేకాకుండా మరోవైపు రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే ఇటీవల కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ తో కూడా బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఫినిష్ చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పటికే పూర్తవాల్సింది. సంక్రాంతికి కూడా విడుదల చేయాలని అనుకున్నారు కానీ మరోవైపు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడం వలన గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే గేమ్ ఛేంజర్ కంటే ముందుగానే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ముందుగా అధికారికంగా సినిమాను లాంచ్ చేయాలి అనే ఇటీవల బుచ్చిబాబు చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక మొత్తానికే సినిమాను ఆగస్టులో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదే ఏడాది డిసెంబర్లో లేదా 2024 జనవరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని దర్శకుడు ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నాడు.
ఇక సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. దీపికా పదుకొనే పేరు మాత్రం చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కూడా త్వరలోనే అధికారికంగా మరో క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక సినిమాను మాత్రం 2025లోనే రిలీజ్ చేయవచ్చు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











