మనసు మార్చుకున్న రామ్ చరణ్.. కన్ఫ్యూజన్ లో స్టార్ డైరెక్టర్స్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ RRR సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్స్ అందుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలతో మంచి హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు. RRR కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. అయితే ఆ సినిమా అంచనాలను మించేలా మరో సినిమా చేయాలంటే కష్టమే..

RRR తరువాత..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 400కోట్ల బిగ్ బడ్జెట్ మొవీపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా నెలకొన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ సినిమాకి ఇప్పటికే మంచి మార్కెట్ ఏర్పడింది. రిలీజ్ చేస్తే పోటీగా ఎలాంటి స్టార్ హీరోలున్నా వెనకడుగు వేయాల్సిందే. ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్న RRR తరువాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఆ దర్శకులతో..
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో మరికొన్ని ప్రాజెక్టులను సెట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా తన స్థాయికి తగ్గట్లు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రామ్ చరణ్ అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటి వారితో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే కథలపై చర్చలు జరిగాయి. కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు.

కన్ఫ్యూజన్ లో పడేసిన రామ్ చరణ్..
RRR రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికే జనాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా సినిమాలో సాలీడ్ గా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే చెప్పేశారు. అన్ని భాషల్లో ఆ లుక్ కి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఏ విధంగా అంచనాలను క్రియేట్ చేస్తుందో చెప్పవచ్చు.
Recommended Video

లాక్ డౌన్ తరువాత..
రామ్ చరణ్ RRR సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. జనవరిలో రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఈ లాక్ డౌన్ అనంతరం పరిస్థితులను బట్టి ముందు RRR రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తరువాతే నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆలోచించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందే అనే టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











