ఖైరతాబాద్ ఆర్టీవోలో రాంచరణ్ సందడి.. ఆయన కొత్త కారు బ్రాండ్ ఏంటి? దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ మంగళవారం (అక్టోబర్ 10వ తేదీ)న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీవో ఆఫీస్‌లో సందడి చేశారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు పొటేత్తారు. ఈ సందర్భంగా చెర్రీకి అధికారులు స్వాగతం పలికి మర్యాదలు చేశారు. రాంచరణ్ కారు మోడల్, దాని ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..

RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రాంచరణ్‌కు విలాసవంతమైన, ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి వచ్చే కొత్త వాహనాలను ఇష్టంగా కొనుగోలు చేస్తారనే విషయం తెలిసిందే. ఆయన గ్యారేజీలో టాప్ ఎండ్ మోడల్ కార్లు చాలానే ఉన్నాయని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన తాజాగా కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు.

Ram Charan Visited Khairatabad RTO Office for Rolls Royce Spectre EV Its price and Features details here

అత్యాధునిక వసతులు, సౌకర్యాలు, కొత్త ఫీచర్స్‌తో ఉన్న రోల్స్ రాయిస్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. దాని హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర సుమారుగా 7.5 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఎలక్ట్రికల్ ఫీచర్స్‌తో ఉండే ఫాంథామ్ కారును తొలిసారి మార్కెట్‌లోకి తెచ్చారు. ఈ వాహనం వీల్స్ సుమారుగా 23 ఇంచులు ఉండటం ఓ ప్రత్యేకతగా చెప్పుకొన్నారు. స్పెక్ట్రమ్ ఈవీ ఫీచర్ మరో అదనపు ఆకర్షణ అని వెల్లడించారు.

రోల్స్ రాయిస్ పాంథామ్ విషయానికి వస్తే.. 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారుగా 530 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే.. జీరో నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌ను సుమారుగా 4 సెకన్లలోనే అందుకొంటుంది అని చెప్పారు.

గత జూలైలోనే రాంచరణ్ రోల్స్ రాయిస్ ఫాంథాన్ 7 కారును కొనుగోలు చేశారు. దానిని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో తాత్కాలికంగా రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు తీరిపోవడంతో ఆయన వచ్చి పర్మనెంట్ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు.

ఇక రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సినీ క్రిటిక్స్, అభిమానులనే కాకుండా పాపులర్ హాలీవుడ్ దర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. ఆయన ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందించే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఆయన నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X