RRR : థియేటర్లో సడన్ ఎంట్రీ ఇచ్చిన రామరాజు.. షాకైన ఆడియన్స్.. పిక్స్ వైరల్!
సినిమాలందు రాజమౌళి సినిమాలు వేరయా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నట్టుగా హీరోలందు రాజమౌళి హీరోలు వేరు అన్నట్టు మారింది పరిస్థితి. ఆయనతో సినిమాలు చేసిన అందరూ ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఆ స్థాయి అందుకోగా ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక పని మీద ముంబై వెళ్లిన రామ్ చరణ్ అనూహ్య పరిస్థితుల్లో థియేటర్లో ప్రత్యక్షం అయ్యారు. ఆ వివరాలు

అల్లూరి సీతారామరాజు పాత్రలో
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్.. కొమురం భీం పాత్రలో నటించి మెప్పించారు.

మంచి వసూళ్లు
క్రేజీ కాంబోలో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన RRR సినిమా కేవలం తెలుగు బాషలోనే కాక అనేక బాషలలో మంచి వసూళ్లు సాధిస్తోంది. హిందీలో అయితే ఈ సినిమా అద్భుతమైన జోరు చూపిస్తోంది. ఎన్టీఆర్, చరణ్ ల యాక్టింగ్ కు నార్త్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

అల్పాహారం కోసం పిలిపించి
మరీ ముఖ్యంగా రామ్ చరణ్ క్లైమాక్స్ లో రాముడి పాత్రలో కనిపించడంతో ఆయనకు కు నార్త్ లో మరింత క్రేజ్ పెరిగిపోయింది. అయితే RRR సూపర్ డూపర్ హిట్‌తో రామ్ చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అందులో భాగంగానే RRR కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను తన ఇంటికి అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని విధంగా బహుమతి ఇచ్చారు.

బంగారం కాయిన్ కానుకగా
RRR సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి ఆహ్వానించి వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కో తులం(10 గ్రాముల) బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాకుండా ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించారు.

రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో
ఇక ఇప్పుడు రామ్ చరణ్ ముంబైలోని ఓ సినిమా థియేటర్‌కు వెళ్లాడు. బాంద్రాలో ఉన్న గైటీ అనే థియేటర్ లోకి రామ్ చరణ్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. థియేటర్ లో సీరియస్ గా RRR సినిమా చూస్తున్న ప్రేక్షకుల ముందుకు స్వయంగా రామరాజు రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్నవాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

సోషల్ మీడియాలో వైరల్
రామ్ చరణ్ ఆకస్మిక ఎంట్రీతో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు తమదైన రీతిలో వెల్ కమ్ చెప్పారు. సినిమా గురించి ప్రేక్షకులతో మాట్లాడిన చరణ్ వారితో కాసేపు సరదాగా గడిపారు. దానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











