ఇన్‌స్టా వీడియోతో రామ్ చరణ్ అభిమానులను టెమ్ట్ చేస్తున్న ఉపాసన!

Recommended Video

ఇన్‌స్టా వీడియోతో రామ్ చరణ్ అభిమానులను టెమ్ట్ చేస్తున్న ఉపాసన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ చెర్రికి సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన భర్త సినిమాలకు సంబంధించిన విశేషాలు, ఫిట్‌నెస్ సీక్రెట్స్ షేర్ చస్తుంటారు. తాజాగా చెర్రీకి సంబందించిన మరో వీడియో పోస్టు చేసిన ఉపాసన 'ఒక వారం కష్టపడ్డ తర్వాత మీకు మీరుగా ట్రీట్ ఇచ్చుకోండి. మీ శరీరాన్ని ప్రేమించండి, మీపై మీరు శ్రద్ధ చూపండి' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో రామ్ చరణ్ చాకొలేట్ వేపర్ తింటూ కనిపించారు. ఈ వీడియో మెగా అభిమానులను టెమ్ట్ చేస్తోంది.

అసలు ఏమిటీ వీడియో?

రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో, డైట్ విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటారు. ఇందుకోసం తమకు ఇష్టమైన పదార్థాలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే వారం పాటు బాగా ఎక్సర్ సైజ్ చేసి.... ఒక రోజు మీ ఇష్టమైన స్వీట్స్, చాకొలెట్లు తినొచ్చు అంటూ రామ్ చరణ్ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది ఉపాసన.

చిన్ననాటి జ్ఞాపకాల్లోకి

ఓ సూపర్ మార్కెట్లో తన తనకు ఇష్టమైన కుకీస్, వేపర్స్, చాకొలెట్ల సముదాయం వద్ద నిల్చొని రామ్ చరణ్ తన చిన్న నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది.

రామ్ చరణ్ మూవీ విశేషాలు

రామ్ చరణ్ మూవీ విశేషాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 12 చిత్రం (#RC12) షూటింగులో బిజీగా ఉన్నారు. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ యూరఫ్‌లోని అజ‌ర్ బైజాన్‌ అనే ప్రాంతంలో జరుగుతోంది. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి టాలీవుడ్ మూవీ కూడా ఇదే.

సంక్రాంతి రిలీజ్

సంక్రాంతి రిలీజ్

రామ్‌చరణ్‌, కియ‌రా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈచిత్రం సంక్రాంతి 2019కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి స్టిల్స్: జీవ‌న్‌, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X