Game Changer: కూతురి కోసం చరణ్ కీలక నిర్ణయం.. టైం వేస్ట్ కాకుండా మాస్టర్ ప్లాన్

కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే బీభత్సమైన ఫామ్‌తో సత్తా చాటుతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో అతడు భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా గ్లోబర్ స్టార్‌ అనే పేరును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ మెగా హీరో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు చరణ్ 'గేమ్ చేంజర్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' మూవీని లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఇప్పటికి దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు.

Ram Charan will Join Game Changer Shooting From July 3rd Week

ఇక, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ లీకైంది.

హై రేంజ్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను వచ్చే వారం నుంచి మొదలుపెట్టబోతున్నారని తాజాగా ఓ న్యూస్ తెలిసింది. ఇందులో రామ్ చరణ్ పాల్గొనాల్సి ఉన్నా.. ఇటీవలే కూతురు పుట్టిన జోష్‌లో ఉన్న అతడు షూట్‌కు గైర్హాజరు అవుతున్నాడట.

అంతేకాదు, మరో 20 రోజుల వరకూ అందుబాటులో ఉండనని ముందే చెప్పేశాడట. దీంతో శంకర్ టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం హీరో లేని సన్నివేశాలను షూట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అంటే.. జూలై 3వ వారం వరకూ చరణ్ లేని సీన్స్‌నే తీస్తారని టాక్.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇది వర్కౌట్ అయ్యే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X