ఎలాంటి డైలామాలో లేను.. ఎనర్టిటిక్ స్టార్ క్లారిటీ
ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. మాస్ చిత్రాలను టచ్ చేయని చాక్లెట్ బాయ్..మొదటి సారిగా ఫుల్ మాస్ లుక్‌లో అదరగొట్టేశాడు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న సక్సెస్.. ఇస్మార్ట్ శంకర్ రూపంలో దక్కింది. అటు దర్శకుడిగా పూరీ జగన్నాథ్, ఇటు హీరోగా రామ్ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా మిగిలింది. ఇస్మార్ట్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడ్డ రామ్.. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు.
తమిళ నాట సూపర్ హిట్ అయిన ఓ మూవీ చిత్రానికీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు RED అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన మనసా సాంగ్ కూడా ఫుల్ వైరల్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. అయితే కరోనా విజృంభించడంతో అంతా తలకిందులైంది.

అయితే ఈ చిత్రానికి అమెజాన్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మంచి ధర వచ్చిందని అందులో రిలీజ్ చేద్దామా? వద్దా? అనే డైలామాలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. తాజాగా రామ్ వాటిపై స్పందిస్తూ.. రామ్ ఎలాంటి డైలామాలో లేడు.. వాస్తవంగా చెప్పాలంటే.. ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి సామాజిక దూరం పాటిస్తూ.. హోమ్ క్వారంటైన్ (దాదాపు 15 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాను)లో ఉన్నాను. నా ఫ్యాన్స్ RED సినిమాను బిగ్ స్క్రీన్‌లో చూడాలని ఎదురుచూస్తున్నా'నంటూ రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు.


Click it and Unblock the Notifications











