రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీ.. దర్శకుడు ఎవరంటే?
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఈ గురువారం ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో రామ్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇస్తున్నాడు. ఇక ఇటీవల బోయపాటి అనంతరం మరొక పాన్ ఇండియా దర్శకుడితో కూడా సినిమా ఉండబోతుంది అని రామ్ చెప్పకనే చెప్పేసాడు..

ది వారియర్.. కిక్కిచ్చే సినిమా
రామ్ పోతినేని ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో మంచి ఎక్కించే పాయింట్ ఉంటేనే ఒప్పుకుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అయినా కూడా రామ్ తన శక్తికి మించి కష్టపడే విధంగా సినిమాలో అయితే నటిస్తూ ఉంటాడు మ్ ఇక ఇప్పుడు ది వారియల్ సినిమాతో అంతకుమించి అనేలా కిక్కు ఇవ్వబోతున్నట్లుగా ఎంతో నమ్మకంతో చెబుతున్నాడు

డిఫరెంట్ షేడ్స్ లో..
కంప్లీట్ యాక్షన్ సినిమాగా మాస్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకునే విధంగా దివారియర్ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ పోతినేని రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. కమర్షియల్ మాస్ దర్శకుడు లింగస్వామి కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఫ్యాన్ ఇండియా
ది వారియర్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో రామ్ పోతినేని తన భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్టులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ సినిమా అయితే బోయపాటి దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే తెరపైకి వస్తుంది అని క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని బోయపాటి పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు రామ్ తెలియజేశాడు.

సుక్కుతో మరో సినిమా
మరొక పాన్ ఇండియా డైరెక్టర్ తో కూడా రామ్ పోతినేని సినిమా చేసే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పేశాడు. అతను మరెవరో కాదు ఇటీవల పుష్పా సినిమాతో ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్ అని అన్నారు. సుక్కుతో కూడా తప్పకుండా మరొక సినిమా చేయనున్నట్లుగా వివరణ ఇచ్చాడు.

చాలాసార్లు అన్నారు
సుకుమార్ ఆర్య సినిమా తర్వాత రామ్ పోతినేని తో జ్ చేసిన జగడం సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఆ సినిమా ఇప్పటికీ ఓవర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రావాలి అని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇక అదే విషయంపై రామ్ పోతినేని ఇటీవల స్పందిస్తూ సుకుమార్ కూడా తనతో చాలాసార్లు మరొక సినిమా చాలా పవర్ఫుల్ గా చేద్దామని అన్నట్లుగా వివరణ ఇచ్చాడు. ఇక సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ అనంతరం విజయ్ దేవరకొండ తో అలాగే రాంచరణ్ తో సినిమాలను చేయనున్నాడు. ఇక ఆ తర్వాత రామ్ చేసే అవకాశం ఉండవచ్చు.


Click it and Unblock the Notifications











