మరో స్టార్ డైరెక్టర్ తో రామ్ పోతినేని చర్చలు.. ప్లాన్ మామూలుగా లేదు?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం 'ది వారియర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ మాస్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 17వ తేదీన తెలుగు తమిళ్లో ఒకేసారి విడుదల కాబోతోంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని రామ్ పోతినేని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల రెండు భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ది వారియర్ సినిమాలో అన్ని రకాల మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగా ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక రామ్ పోతినేని కెరిర్ లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆది పినిశెట్టి ఇందులో పవర్ ఫుల్ కనిపిస్తుండడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని మరింత పెంచేశాయి.

Ram pothineni another project planing with talented tamil director

ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే రామ్ పోతినేని మరోవైపు బోయపాటి శ్రీనుతో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆ సినిమా తెరపైకి రాబోతోంది. అలాగే ఇటీవల రామ్ మరొక తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కూడా ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ఆ దర్శకుడు శింబుతో 'వెందు తానింధాతు కాడు' అనే ఒక యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో నటనకు మంచి స్కోప్ కూడా ఉంటుందట. అయితే రీసెంట్ గా గౌతమ్ రామ్ తో కలిసి అదే కథ విషయంలో కొంత చర్చలు జరుపినట్లు తెలుస్తోంది. గతంలో నే రామ్ తో గౌతమ్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు ఎందుకో క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు ఈ దర్శకుడు రామ్ తో సరైన యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి రామ్ పోతినేని గౌతమ్ వాసుదేవన్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X