For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరద బాధితులకు అండగా.. కేటీఆర్‌కు చెక్ అందించిన రామ్

    |

    ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ హీరో రామ్ తెరపై ఎంత చురుకుగా ఉంటాడో పరులకు సాయం చేసే విషయంలోనూ అంతే ముందుంటారు. మాటిచ్చి మరిచిపోకుండా వెంటనే ఆచరణలో పెట్టేస్తాడు. హైద్రాబాద్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైద్రాబాద్ మొత్తం జలమయమైంది. కాలనీలు, ఇండ్లలోకి నీళ్లు వచ్చి మొత్తం కొట్టుకుపోతున్నాయి.

    ఈ వర్షాల దెబ్బకు నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. వరదలు సిటీని ముంచెత్తాయి. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుక తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద 550 కోట్లకుపైగా నిధులన విడుదల చేసింది. ప్రభుత్తం స్పందించిన తీరుకు ముగ్దులైన సినీ ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సినీ సెలెబ్రిటీలందరూ తోచినంత విరాళాలను అందించారు.

    Ram Pothineni Cheque To KTR About Hyderabad Floods
    Ram Pothineni Cheque To KTR About Hyderabad Floods

    ఈ క్రమంలోనే ఉస్తాద్ రామ్ ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 25 లక్షల రూపాయల చెక్కును కేటీఆర్‌కు అందజేశాడు. నేటి ఉదయం కేటీఆర్ కార్యాలయానికి వెళ్లి చెక్కును అందజేసి.. ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించాడు. కేటీఆర్ కూడా రామ్‌కు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులపై చర్చించినట్టు తెలుస్తోంది. దర్శకుడు ఎన్ శంకర్ కూడా పది లక్షల రూపాయల చెక్కును కేటీఆర్‌కు అందజేశాడు.

    English summary
    Ram Pothineni Cheque To KTR About Hyderabad Floods, Ustaad ramsayz Contributed 25L Rupees to The CM Relief Fund To Help The people effected By The Floods in Hyderabad. Handed Over the Cheque to KTRTRS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X