Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వరద బాధితులకు అండగా.. కేటీఆర్‌కు చెక్ అందించిన రామ్
ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ హీరో రామ్ తెరపై ఎంత చురుకుగా ఉంటాడో పరులకు సాయం చేసే విషయంలోనూ అంతే ముందుంటారు. మాటిచ్చి మరిచిపోకుండా వెంటనే ఆచరణలో పెట్టేస్తాడు. హైద్రాబాద్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైద్రాబాద్ మొత్తం జలమయమైంది. కాలనీలు, ఇండ్లలోకి నీళ్లు వచ్చి మొత్తం కొట్టుకుపోతున్నాయి.
ఈ వర్షాల దెబ్బకు నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. వరదలు సిటీని ముంచెత్తాయి. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుక తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద 550 కోట్లకుపైగా నిధులన విడుదల చేసింది. ప్రభుత్తం స్పందించిన తీరుకు ముగ్దులైన సినీ ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సినీ సెలెబ్రిటీలందరూ తోచినంత విరాళాలను అందించారు.
ఈ క్రమంలోనే ఉస్తాద్ రామ్ ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 25 లక్షల రూపాయల చెక్కును కేటీఆర్‌కు అందజేశాడు. నేటి ఉదయం కేటీఆర్ కార్యాలయానికి వెళ్లి చెక్కును అందజేసి.. ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించాడు. కేటీఆర్ కూడా రామ్‌కు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులపై చర్చించినట్టు తెలుస్తోంది. దర్శకుడు ఎన్ శంకర్ కూడా పది లక్షల రూపాయల చెక్కును కేటీఆర్‌కు అందజేశాడు.