twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరి కోణంలోంచి వారు ఆలోచిస్తారు.. రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    |

    కరోనా వైరస్ మానవాళి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తోంది. కరోనా ఇప్పట్లో వదిలి వెళ్లేలా లేదని అందరికీ అవగతమైంది. ఈ క్రమంలోనే కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ఎన్నో దేశాలు అందుకు అనుగుణంగా సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా బారిన పడకుండా ఉండేందుకు వీలుగా తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. కరోనా వైరస్ ఎన్నో సమూలమైన మార్పులను తీసుకొచ్చేలా కనిపిస్తోంది. అందులో భాగంగా సినీ పరిశ్రమపై భారీ మార్పులు సంభవించబోతోన్నట్టు కనిపిస్తోంది.

    ఈ క్రమంలో మొదటగా థియేటర్స్‌పైనే మొదటి దెబ్బ పడేట్టు కనిపిస్తోంది. తాజాగా మంత్రి తలసాని చేసిన కామెంట్స్ ఇంకో మూడు నాలుగు నెలల వరకు థియేటర్స్ ఓపెన్ చేయడం కుదరదు. ఆపైనా జనాలు థియేటర్స్‌కు వస్తారన్న నమ్మకం లేదు. కరోనా పూర్తిగా ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇకపై మునుపటిలా బారులు తీరేలా క్యూ లైన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో, థియేటర్లో హౌస్ ఫుల్ లాంటివి కనిపించకపోవచ్చు. ప్రస్తుతం కొంతమంది ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.

     Ram Pothineni Counters On OTT Release Instead Of Theaters

    ఇప్పటికే షూటింగ్స్ పూర్తై రిలీజ్‌కు రెడీ ఉన్న చిత్రాలు బోలెడు ఉన్నాయి. వీటి నిర్మాతలు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారి సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి ఎంతో కొంత నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఓటీటీ, థియేటర్స్ అంటూ రెండు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈనిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓ సెటైర్ వేశాడు. సినిమా అనేది కొందరికి ప్యాషన్, ఇంకొందరికి వ్యాపారం.. మిగిలిన వారందరికీ గ్యాంబ్లర్ (జూదం).. ఎవరి కోణంలో వారు ఆలోచిస్తుంటారు.. ఓటీటీ, థియేట్రికల్ అంటూ ట్వీట్ చేశాడు.

     Ram Pothineni Counters On OTT Release Instead Of Theaters

    English summary
    Ram Pothineni Counters On OTT Release Instead Of Theaters. He Says That The thing about the Movie Industry is.. It’s a Passion for a few.. a Business for most.. & a Gamble for the rest.. Everyone sees it from their own perspective..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X