రామ్ పోతినేని 9 సెంచరీలు.. ఇండియాలోనే ఏకైక హీరోగా గొప్ప రికార్డు
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన నటనతో మెప్పిస్తూ చాలా కాలంగా స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. మొదటి చిత్రం నుంచే ప్రత్యేకతను చాటుకుంటోన్న అతడు.. ఫలితాలను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా వరుసగా మూవీలను చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. అలాగే, తన రేంజ్‌ను కూడా పెంచుకున్నాడు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో రామ్ రికార్డుల బెండు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు నేషనల్ రికార్డును కొట్టేశాడు. ఆ సంగతులను మీరే చూసేయండి మరి!
యూట్యూబ్‌లో రామ్ క్రేజ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సినిమా పరంగా సత్తా చాటుకుంటున్నాడు. అలాగే, యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. గతంలో ఎన్నో సినిమాలు అక్కడ భారీ స్థాయిలో వ్యూస్ సాధించాయి. సినిమాల టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తన హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాడు.

హిందీలో బాగా పాపులర్
రామ్ సినిమాలకు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అతడి సినిమా హిందీ డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. గతంలో కూడా కొన్ని సినిమాలు మంచి వ్యూస్ సాధించాయి. దీంతో నిర్మాతలు ఈ విధంగా కూడా రైట్స్‌ను భారీ ధరలకు అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లే అక్కడ రెస్పాన్స్ లభిస్తోంది.
గతంలో ఎనిమిది సార్లు
రామ్ పోతినేని నటించిన సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇలా ఇప్పటికే అతడు నటించిన 'హైపర్', 'గణేష్', 'పండగ చేస్కో', 'ఇస్మార్ట్ శంకర్', 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమ కోసమే', 'ది వారియర్' సినిమాలు భారీ రెస్పాన్స్ అందుకుని 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటేశాయి.

ఇప్పుడు మరో సెంచరీ
రామ్ పోతినేని రీసెంట్‌గా 'స్కంద' అనే సినిమాలో నటించాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. దీన్ని ఇదే పేరుతో హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. అంతే.. అక్కడ భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ సినిమా తాజాగా 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది.
9 సార్లు.. నేషనల్ రికార్డ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన చిత్రాలకు యూట్యూబ్‌లో హిందీ ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందిస్తున్నారు. తద్వారా అతడు నటించిన తొమ్మిది చిత్రాలు యూట్యూబ్‌లో 100 మిలియన్ మార్కును చేరుకున్నాయి. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా రామ్ పోతినేని రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications











