ఆ ఫీట్ అందుకున్న సౌత్‌లోని ఏకైక హీరో.. రామ్ ఇస్మార్ట్ రికార్డ్

మన తెలుగు సినిమాలకు ప్రస్తుతం ఫుల్ గిరాకీ ఉంది. సోషల్ మీడియాలో మన మాస్ హీరోల సత్తా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు మన మాస్ సినిమాలంటే విపరీతంగా వీక్షిస్తుంటారు. మన తెలుగు సినిమాలు డబ్బింగ్ రూపంలో అక్కడకు వెళ్లి సూపర్ హిట్స్ అవుతుంటాయి. ఇక్కడ యావరేజ్, బిలో యావరేజ్ అయిన చిత్రాలు అక్కడ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయి.

ముఖ్యంగా మన సినిమాల్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్, లవ్ ట్రాకులు, కామెడీని అక్కడి జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే మన తెలుగు హీరోల సినిమాల డబ్బింగ్ రైట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా రామ్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మన రామ్ హిందీ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. రామ్ చిత్రాలన్ని హిందీలో డబ్ అవుతుంటాయి. యూట్యూబ్‌లో రామ్ హిందీ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుంటాయి.

Ram Pothineni Ganesh Hindi Dubbed Crossed 100 Million Views

వరుసగా ఆరు చిత్రాలు వంద మిలియన్లను కొల్లగొట్టి సౌత్ నుంచి ఆ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా రామ్ నిలిచాడు. తాజాగా రామ్ కాజల్ జంటగా వచ్చిన గణేష్ హిందీ డబ్బింగ్ చిత్రం వంద మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇంతకు ముందు ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, కందిరీగ, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో చిత్రాలు వంద మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టేశాయి. రామ్ ప్రస్తుతం RED మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X