సందీప్ కిషన్ కోసం ఇస్మార్ట్ హీరో.. అలా సాయం చేస్తోన్న రామ్!

సందీప్ కిషన్ ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ అంటూ రాబోతోన్న సందీప్ కిషన్ ఈ సారి సాలిడ్‌గా హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఇందులో లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా ఉంది. మొదటిసారిగా లావణ్య లిప్ లాక్‌కు అంగీకరించినట్టు కనిపిస్తోంది.

అయితే ఏ1 ఎక్స్‌ప్రెస్ మార్చి 5న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచేసింది చిత్రయూనిట్. అందులో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని మేకర్స్ ప్రకటించేశారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని తెలిపారు.

Ram Pothineni Guest For Sundeep kishan A1 Express Event

అంతే కాకుండా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు ప్రకటించేశారు. మొత్తానికి సందీప్ కిషన్ కోసం రామ్ ఇలా సాయం చేసేందుకు వచ్చేస్తున్నాడు. చివరకుగా రామ్ RED సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేశాడు. ఈ మధ్యే తన కొత్త ప్రాజెక్ట్ వివరాలను ప్రకటించేశాడు. తమిళ దర్శకుడు లింగుసామి కాంబోలో ఓ సినిమాను అనౌన్స్ చేసేశాడు.త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X