రామ్ ఖాతాలో అరుదైన రికార్డ్.. సౌత్ ఇండియాలోనే మొదటి హీరోగా ఘనత.. అందులో బన్నీదే టాప్ ప్లేస్
సాధారణంగా తెలుగు సినిమాలు తెరకెక్కే సమయంలోనే దాని మార్కెట్‌ను బట్టి బయ్యర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏరియాల వారీగా అమ్మడం, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇలా చాలా రకాలుగా ఒక సినిమాతో మార్కెట్ చేస్తూ ఉంటారు. వీటిలో సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు ఇప్పుడు బాగా ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి కారణం ఉత్తరాది వాళ్లకు మన సినిమాలు తెగ నచ్చేస్తుండడమే. తెలుగులో వచ్చిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం సర్వ సాధారణం. కానీ, అంతకంటే ఎక్కువగా హిందీలోకి డబ్బింగ్ చేసేస్తున్నారు కొందరు సినీ ప్రముఖులు. తద్వారా లాభాలను గడిస్తున్నారు. తాజాగా ఓ తెలుగు సినిమా హిందీలో రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా.?

రామ్ సినిమాకు ఊహించని రెస్పాన్స్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘హలో గురూ ప్రేమ కోసమే' హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కొద్ది రోజుల క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘దుండార్ కిలాడీ' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూస్ సాధించి రికార్డులకెక్కింది. దీంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

వ్యూస్ మాత్రమే కాదు అంతకు మించి
‘దుండార్ కిలాడీ' లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఏ సినిమాకూ దక్కని రీతిలో ఈ మూవీకి స్పందన వస్తోంది. మొదటి నుంచీ దూకుడు ప్రదర్శిస్తున్న ఈ సినిమా ఇప్పటికే యూట్యూబ్‌లో 141 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులకెక్కింది. ఇంకా హవా చూపిస్తూనే ఉంది.
దక్షిణ భారతదేశంలోనే మొదటిది
కేవలం వ్యూస్ పరంగానే కాదు.. ఈ సినిమా మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ‘దుండార్ కిలాడీ' ఒక మిలియన్ లైకులు దక్కించుకుంది. ఇలా గతంలో ఏ తెలుగు సినిమాకూ లైకులు రాలేదు. అంతేకాదు, ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలోని పరిశ్రమలకు సంబంధించిన ఏ సినిమాకూ ఈ స్థాయిలో లైక్స్ రాలేదు.

మీ పిచ్చి ప్రేమకు థ్యాంక్స్
దక్షిణాదిలోనే ఏ సినిమాకూ దక్కని రికార్డు తన సొంతం అవడంతో హీరో రామ్ ఖుషీ అయిపోతున్నాడు. దీంతో తన ట్విట్టర్‌లో ‘మీ పిచ్చి పిచ్చి పిచ్చి ప్రేమకు థ్యాంక్స్' అని పోస్టు పెట్టాడు. అంతేకాదు, ఈ సినిమా సాధించిన ఘనతను కూడా ఫొటో రూపంలో షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కొద్ది సేపట్లోనే వైరల్ అయిపోయింది.

ఆ రికార్డు మాత్రం బన్నీదే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు' హిందీ వాళ్లకు తెగ నచ్చేసింది. ఆ మూవీకి 244 మిలియన్లకు పైగా వ్యూస్, ఏడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే, ‘డీజే' కూడా 197 మిలియన్ వ్యూస్‌తో పాటు ఆరు లక్షల పైచిలుకు లైకులు సొంతం చేసుకుంది. దీంతో వరుసగా రెండు సినిమాలకు 150 మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టిన హీరోగా బన్నీ రికార్డులకెక్కాడు.


Click it and Unblock the Notifications











