For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఊహించని బ్యాగ్‌డ్రాప్‌తో రామ్ సినిమా: షూటింగ్ పిక్ లీక్ చేసిన ఫ్యాన్.. అలా మేటర్ లీక్

  |

  ప్రముఖ నిర్మాత ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న వయసులోనే భారీ సక్సెస్‌లను అందుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే, మధ్య చాలా కాలం పాటు సక్సెస్‌కు దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' అనే మూవీతో రామ్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే ఈ ఏడాది ఆరంభంలో 'రెడ్' అనే మరో విజయాన్ని అందుకున్నాడు.

  బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన ప్రదీప్: అవసరానికి ఫోన్ చేస్తే అలా.. సీక్రెట్ లీక్ చేసిన యాంకర్

  వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న రామ్ పోతినేని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ మధ్యనే రెగ్యూలర్ షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ ఫిల్మ్ చిత్రీకరణను పూర్తి చేయాలని యూనిట్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా టాకీ పార్ట్‌ను ముందుగా కంప్లీట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  Ram Pothineni - Lingusamy Movie with Faction Backdrop

  ఈ సినిమా కథ విషయంలో చాలా రోజులుగా ఎన్నో వార్తలు ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కథా నేపథ్యం గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కుతోందట. ఈ వార్త వైరల్ అవడానికి కారణం.. తాజాగా రామ్ అభిమాని అతడితో షూటింగ్ స్పాట్‌లో దిగిన ఓ ఫొటోను షేర్ చేయడమే. ఇందులో కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెట్టింగ్ కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందుతుందనే టాక్ మొదలైంది. ఇక, ఈ ఫొటోను షేర్ చేస్తూ ఆ అభిమాని 'నా పుట్టినరోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రామ్ అన్నకు థ్యాంక్స్' అని అతడు ట్వీట్ చేశాడు.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ భారీ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఇక, ఈ మూవీలో కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Tollywood Star Hero Ram Pothineni Now Doing a Film Under Kollywood Director Lingusamy Direction. This Film will Made with Ram Faction Backdrop.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X