రామ్ స్టన్నింగ్ లుక్.. అమాంతం పదేళ్లు వెనక్కి!
ఇస్టార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఎలా కనిపించాడో అందరికీ తెలిసిందే. హైద్రాబాద్ గల్లీ పోరడు, మాస్‌కు అంబాసిడర్‌లా ఉన్న ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు మరో కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ కోసం గడ్డం, కొత్త హెయిర్ స్టైల్‌ను ట్రై చేసిన రామ్ తదుపరి చిత్రం కోసం మరింత విభిన్నంగా కనిపించేందుకు ఆసక్తిని చూపించాడు.
RED సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికి ఎప్పుడో సినిమా విడుదలై హిట్ అయ్యేది కూడా. అయితే లాక్ డౌన్ విధించడంతో అంతా తారుమారైంది. ఈ క్రమంలో RED లుక్ లోంచి కూడా రామ్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సెలెబ్రిటీలందరూ తాము లాక్ డౌన్‌లో ఎలా గడుపుతున్నారో చూపిస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే రామ్ మాత్రం అలాంటి అప్‌డేట్స్ ఏమీ ఇవ్వడం లేదు.

మొన్నామధ్య RED సినిమా విడుదల విషయంలో రామ్ డైలామాలో ఉన్నాడని వచ్చిన వార్తలపై స్పందించాడు. రామ్ అలాంటి డైలామాలో లేడని, ప్రభుత్వం విధించిన నియమాలకు లోబడి లాక్ డౌన్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అంతా సద్దుమణిగాక వెండితెరపై కనిపిస్తాని తెలిపాడు. తాజాగా రామ్ షేర్ చేసిన ఫోటో చూస్తే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే. క్లీన్ షేవ్‌లో ఓ పదేళ్లు వెనక్కి వెళ్లినట్టు కనిపించి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











