ఎంత అలస్యమయినా కూడా రిస్క్ చేయడట.. ఇస్మార్ట్ హీరో న్యూ ప్లాన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు రామ్ పోతినేని. మొత్తానికి వరుస డిజాస్టర్స్ అనంతరం ఇస్మార్ట్ శంకర్ తో ట్రాక్ లోకి వచ్చిన రామ్ ఇక నెక్స్ట్ సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన రెడ్ అనే సినిమాను ఎప్పుడో పూర్తి చేసిన రామ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
గతంలో ఎప్పుడు లేని విధంగా రిలీజ్ కన్ఫ్యూజన్ లో పడిన ఈ హీరో థియేటర్స్ తెరచుకున్నప్పటికి ఇంకా రిస్క్ చేయడానికి ఇష్ట పడటం లేదు. సంక్రాంతి రిలీజ్ చేయాలని దాదాపు ఫిక్స్ అయినప్పటికీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నాడట. అంతే కాకుండా జనాలు గతంలో మాదిరిగా థియేటర్స్ కు వస్తారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఆ భయం ఎక్కువగానే ఉంది.

సినిమా దాదాపు ఏడాది ఆలస్యం అయినా కూడా రామ్ ఏ మాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. సంక్రాంతి కాకపోతే సమ్మర్ లో కూల్ గా రిలీజ్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. నివేత పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అంధించాడు.


Click it and Unblock the Notifications











