రామ్ కూడా పాన్ ఇండియా అంటున్నాడే.. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ లో రోజురోజుకి పాన్ ఇండియా ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. సరైన కథ తగిలితే ఎలాగైనా అన్ని భాషల్లో ఓకేసారి సినిమాను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అందుకు కారణం.. ఈ మధ్య మన తెలుగు సినిమాలను పరభాషా సినీ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. రామ్ పోతినేని డబ్బింగ్ సినిమాలను కూడా నార్త్ జనాలు ఎగబడి చూస్తున్నారు.
దీంతో ఈ కుర్ర హీరో కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ కోసం ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ తమిళ్ సినిమా చేయడానికి కూడా రామ్ ఆలోచిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అనుకున్నట్టు జరిగితే భవిష్యత్తులో రామ్ నుంచి కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బాక్సాఫీస్ హిట్టు అనంతరం రామ్ ఎవరు ఊహించని విదంగా 'రెడ్' ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా లాక్ డౌన్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఒక సాంగ్ కూడా ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. తమిళ్ హిట్టు సీనిమా తడమ్ కి రీమేక్ గా వస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఎందుకంటే రామ్ చాలా కొత్తగా కనిపించడమే కాకుండా మొదటిసారి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు కాబట్టి సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











